Animal: మొదటి సినిమాతోనే తనదైన రీతిలో కల్ట్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణ్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలని ఈ సినిమా అందుకుంది అనే విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది.
ఎందుకంటే చాలామంది నార్మల్ జనాలు కూడా ఈ సినిమా సూపర్ గా ఉంది అంటూ సినిమా మీద వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇట్లాంటి క్రమంలో దర్శక ధీరుడు అయిన రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ ఈ సినిమాని చూసి తనదైన రీతిలో ఒక పోస్ట్ చేశాడు. రన్బీర్ కపూర్ యాక్టింగ్ ఈ సినిమాలో అద్భుతంగా ఉందని, ఆయన అనిమల్ సినిమా చేయడానికి ఆయన పుట్టారు…తనదైన ఉర మాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులందరిని కట్టిపడేసారు , రేష్మిక మందన తనదైన రీతిలో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది, ఫైనల్ గా దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి లో ఎలాగైతే హీరోని ఎలివేట్ చేస్తూ చూపించారో దానికి ఈ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కూడా తనదైన రీతిలో ప్రతి సీన్ అద్భుతంగా తీశారు.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే గూస్ బమ్స్ వచ్చాయి, ఇలాంటి వాటిని తీయాలంటే అదొక సందీప్ రెడ్డి వంగా కి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ కార్తికేయ తన్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు…ఇక ఇది చూసిన చాలామంది అభిమానులు రాజమౌళి అనిమల్ సినిమా ప్రి రిలీజ్ కి వచ్చి సందీప్ రెడ్డి వంగా గురించి చాలా గొప్పగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూనే కార్తికేయ కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ పట్ల ఆయన చేసిన సినిమాలో పట్ల ఇంత పాజిటివ్ గా స్పందించడాన్ని చూసిన చాలా మంది అభిమానులు సంబరపడుతున్నారు…
ఇక అనిమల్ సినిమా పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైన చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేస్తుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికి రన్బీర్ కపూర్ చేసిన ఈ కల్ట్ క్లాసికల్ మూవీ అతని కెరియర్ లో నటనపరంగా తనకొక మైలురాయిగా మిగిలిపోతుందని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు…
Ranbir Kapoor… THE MASS SUPERSTAR in you has been born with #ANIMAL. The performance will be cherished for a lifetime.@iamRashmika best till date. Loved the confrontation scene in the second half. Terrifically potrayed. @imvangasandeep, only you could imagine such…
— S S Karthikeya (@ssk1122) December 1, 2023