Rajamouli New Experiment On Mahesh: RRR వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ క్రేజీ కాంబినేషన్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఇటీవలే కార్యరూపం దాల్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు..ఇటీవలే ఈయన హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా యావరేజిగా ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇది..త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోబోతుంది..ఈ సినిమా పూర్తయిన తర్వాతనే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లనుంది.

Also Read: Chandrababu Support: చంద్రబాబు మద్దతు ఎవరికో? ..సైలెంట్ కు కారణమేమిటి?
ఇది కాసేపు పక్కన పెడితే రాజమౌళి మహేష్ తో ఎలాంటి జానర్ లో సినిమా తియ్యబోతున్నాడు అనేది సోషల్ మీడియా లో రకరకాల వార్తలు రోజు ప్రచారం అవుతూనే ఉన్నాయి..ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగే కథతో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు అని తెలుస్తుంది..ఈ జానర్ లో ఇండియా లో ఇప్పటి వరుకు ఒక్క సినిమా కూడా రాలేదు..తొలిసారి ఈ ప్రయోగం చేస్తుంది రాజమౌళి గారే..తనకి అలవాటు లేని జానర్ లో ఎలా సినిమా తియ్యబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..ఎందుకంటే ఈ జానర్ లో సినిమా కాస్త తేడా జరిగిన పెద్ద ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువ..ఒక్కవేల అదే జరిగితే రాజమౌళి కెరీర్ లో మొట్టమొదటి బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది..అందుకే ఈ జానర్ ని రాజమౌళి ఎలా డీల్ చేస్తాడా అని టాప్ డైరెక్టర్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఇక ఇటీవలే రాజమౌళి ప్యారిస్ లో ఉండే ప్రముఖ 3D యానిమేషన్ అండ్ VFX ఎఫెక్ట్స్ స్టూడియో ఇమేజ్ కంపెనీ ని సందర్శించారు..ఇక్కడి టెక్నిషన్స్ అండ్ VFX టెక్నిషియన్స్ తో రాజమౌళి చాలాసేపు సుదీర్ఘ చర్చలు జరిపాడు..తన తదుపరి సినిమాకి కలిసి పని చేయబోతున్నాం అని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు..హాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ VFX అందించిన ఈ సినిమా ఇప్పుడు మహేష్- రాజమౌళి సినిమా కోసం పని చేయబోతుంది..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ఏ రేంజ్ తో ప్లానింగ్ తో ఉన్నాడో.

Also Read: BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల టార్గెట్ అదే..
[…] […]
[…] […]
[…] […]