Namrata Shirodkar: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె వంశీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా సమయంలోనే మహేశ్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయి అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ కు సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరిగినా అక్కడ నమ్రత పాల్గొనడం కనిపిస్తుంటుంది. ఇటీవల జరిగిన వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి నుంచి నమ్రత వరుసగా పలు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ..ఆ కార్యక్రమానికే హైలెట్ గా నిలుస్తున్నారు.
రీసెంటుగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖల మ్యారేజీ యానివర్సరీ ప్రైవేట్ జెట్‌లో జరుపుకున్నారు.. అక్కడ కూడా నమ్రత వారితో కనిపించారు. ఇటీవల, దుబాయ్‌లో జరుగుతున్న ప్రైవేట్ పెళ్లిలో కూడా నమ్రత మెరిసింది. ఆహ్వానం వస్తే నమ్రత తప్పకుండా ఏ కార్యక్రమానికి అయినా హాజరవుతుంది. మహేష్ ఎక్కడికి వెళ్లినా తన నీడలా ఉండే నమ్రత, తన సర్కిల్‌లోని ప్రతి కార్యక్రమానికి వెళ్లి అందరితో మంచి అనుబంధాలను కొనసాగిస్తుంది. గతంలో మహేష్ బాబుతో హాజరైన నమ్రత, ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది.. మహేష్ బాబుతో తాను కలిసి రాకపోవడం కాస్త వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. కాకపోతే నమ్రత మహేష్‌ను జాగ్రత్తగా చూసుకోవడం చూసి సంతోషిస్తున్నారు.
నమ్రత ఇలా ఒంటరిగా రావడానికి ప్రధాన కారణం రాజమౌళినే అని కొందరు తిట్టుకుంటున్నారు కూడా. ఎందుకంటే రాజమౌళి మహేశ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతుంది. దీంతో మహేష్ ఆ షుటింగులో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరికీ తెలిసిందే.. ఏ హీరో అయినా తనకు కొన్నాళ్ల పాటు బందీగా ఉండాల్సిందే. వేరే సినిమాలు ఒప్పుకునేందుకు కానీ.. లేదా తన పర్మీషన్ లేకుండా ఎక్కడికి వెళ్లేందుకు కానీ అనుమతి ఉండదు. సో ప్రస్తుతం మహేశ్ కూడా రాజమౌళి చేతిలో లాక్ అయిపోయాడు. దీంతో మహేశ్ అటెండ్ కావాల్సిన కార్యక్రమాలకు తన తరఫున తన భార్య నమ్రత వెళ్తుంది.
రియల్ లైఫ్ లో మహేష్ లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తారు. ఆయన తరఫున నమ్రత దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందరితో కలిసి సంతోషంగా సమయం గడుపుతు చేస్తూ మంచి పబ్లిక్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్ లో బిజీగా ఉండడంతో బయట కార్యక్రమాలకు రాలేని పక్షంతో నమ్రత ఈ బాధ్యతను తీసుకుంది. కొత్త సినిమా కోసం మహేష్ న్యూ మేకోవర్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి అతన్ని ఎక్కడికీ పంపిండం లేదు. ఈ సినిమా రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. మొదటి పార్టు 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో పార్టు 2027లో రానున్నట్లు తెలుస్తోంది.