Rajamouli Eega Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. వరుస సక్సెస్ లను సాధించి పెట్టడంలో దర్శకులు కీలకపాత్ర వహిస్తున్నారు… ఒక హీరోను ఎలివేట్ చేసి చూపించాలన్న ఆ హీరో యొక్క స్థానం తగ్గించాలన్న అది కేవలం దర్శకుల వల్లే అవుతుంది. ఒక సినిమాను సూపర్ సక్సెస్ గా మారిస్తే ఆటోమేటిగ్గా హీరో టాప్ రేంజ్ కి వెళ్ళిపోతాడు. ఒక సినిమాను డిజాస్టర్ గా మారిస్తే ఆ హీరో పాతాళానికి పడిపోతాడు. కాబట్టి దర్శకుడు అనేవాడు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తాడు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో టాప్ లెవెల్ కి వెళ్ళిపోతాడు…
అందుకే రాజమౌళితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తున్నాడు…ఇక ప్రస్తుతం రాజమౌళి చేసే సినిమాలు యావత్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలనైతే చేస్తున్నాడు…
ఇప్పటివరకు రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కథలను అందించాడు. కానీ ఒక్క సినిమాకి మాత్రం రాజమౌళి కథ రాసుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే అది ఈగ సినిమా కావడం విశేషం…ఈ మూవీకి కథ స్క్రీన్ ప్లే కూడా తనే రాసుకొని దర్శకత్వం కూడా తనే చేశాడు…
తన ఎంటైర్ కెరియర్ లో రాసిన ఒకే ఒక కథ అంటూ గతంలో రాజమౌళి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కథ మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా స్క్రీన్ ప్లే దర్శకత్వం మీద ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. కాబట్టి తన సినిమాల కథని వాళ్ళ నాన్నకి అప్పజెప్పి తను మిగతా విషయాలన్నింటిని చూసుకుంటాడనేది వాస్తవం…