
Vijayendra Prasad- Rajamouli: రాజమౌళి సక్సెస్ కి ఆయన ఫ్యామిలీ కూడా కారణం. కుటుంబ సభ్యులు పలు విభాగాలకు పని చేస్తారు. అన్నయ్య కీరవాణి సంగీతం, భార్య రామా రాజమౌళి కాస్ట్యూమ్స్, కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ డిజైన్, వదిన లైన్ ప్రొడ్యూసర్ ఇలా రాజమౌళి సినిమాలో భాగమవుతారు. వీరందరి కంటే మేజర్ కాంట్రిబ్యూషన్ విజయేంద్ర ప్రసాద్ ది. రాజమౌళి చిత్రాలకు దాదాపు కథలు ఇచ్చేది తండ్రి విజయేంద్రప్రసాదే. రాజమౌళిని ప్రపంచ స్థాయి దర్శకుల జాబితాలో చేర్చిన బాహుబలి 1&2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల కథలు విజయేంద్ర ప్రసాద్ సమకూర్చినవే. ఒక స్టార్ రైటర్ తన ఇంట్లోనే ఉండటం రాజమౌళికి చాలా ప్లస్.
ఇద్దరూ కలిసి అనేక సబ్జక్ట్స్, ఐడియాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. విజయేంద్రప్రసాద్ ఇచ్చిన కథలు బాలీవుడ్ లో కూడా సంచలనాలు చేశాయి. భజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక చిత్రాల కథలు విజయేంద్ర ప్రసాద్ రాసినవే. కాగా విజయేంద్రప్రసాద్ రాసిన ఓ స్క్రిప్ట్ చదివి తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని రాజమౌళి వెల్లడించారు. ఆస్కార్ ఈవెంట్ దగ్గరపడుతుండగా రాజమౌళి అమెరికాలోనే ఉన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ… తండ్రి రాసిన ఓ స్క్రిప్ట్ ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో నాన్నగారు ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు. ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను.బాగా ఏడ్చేశాను. ఆర్ఎస్ఎస్ గురించి, దాని భావజాలం గురించి నాకు తెలిసింది తక్కువే. అది ఒక సంస్థ అని మాత్రమే తెలుసు. నాన్న ఆ స్క్రిప్ట్ ఎవరి కోసం రాశారో. నేను డైరెక్ట్ చేస్తానో లేదో కూడా తెలియదు. ఆ స్క్రిప్ట్ తెరకెక్కించే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. ఆ కథలో అంతటి భావోద్వేగాలు ఉన్నాయి… అని రాజమౌళి చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ దశలోనే అంతగా హృదయాన్ని హత్తుకొని కన్నీరు తెప్పించిన కథలో ఏముందనే ఆత్రుత జనాల్లో మొదలైంది.

కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ నామినేట్ అయ్యింది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని సత్తా చాటింది. ఈ క్రమంలో ఆస్కార్ గెలుచుకుంటుందనే విశ్వాసం అందరిలో ఉంది. మరోవైపు రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళి గత చిత్రాల బడ్జెట్ కి మించి భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. మహేష్ చిత్రానికి కూడా కథ విజయేంద్రప్రసాద్ అందించారు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కనుందని వెల్లడించారు.