SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబలి మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా… చిత్ర పరిశ్రమ యావత్తు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతగానో కలిసి వచ్చే సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ప్రభాస్ నటిస్తున్న సినిమాలు గతంలోనే విడుదల తేదీని ప్రకటించాయి. ముగ్గురు పెద్ద హీరోలు కావడంతో కలెక్షన్స్ విషయంలో పెద్ద క్లాష్ వస్తుందని అనుకున్నారు. వీటిలో ప్రధానంగా ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నవే. ఈ రెండూ సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ తరుణంలో ఈ రెండు సినిమాలకు మధ్య పోటీ ఉంటుంది.
వారం రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు బడా సినిమాలు విడుదలవుతుండడంతో అందరిలోనూ ఆసక్తినెలకొంది. తాజాగా ఈ ప్రశ్నే దర్శకుడు రాజమౌళికి కూడా ఎదురైంది. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్ లో పాల్గొన్న రాజమౌళిని రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్‌ల మధ్య పోటీ ఉంటుందా అని విధ్యార్డులు ప్రశ్నించారు. తనదైన శైలిలో స్పందించిన జక్కన్న… సినిమాల మధ్య పోటీ అనేది గతంలో కూడా ఉంది. సినిమాలు ఎన్ని విడుదలైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు. ఇందలో పోటీ అనుకోవడానికి ఏం లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు.