Rajamouli Next Movie With Ram Charan: తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ కి శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే , రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన టాలీవుడ్ ని ‘మగధీర’ కి ముందు , ‘మగధీర’ కి తర్వాత అని డివైడ్ చేయొచ్చు. ఈ చిత్రానికి ముందు మన టాలీవుడ్ డైరెక్టర్లు , నిర్మాతలు, హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి భయపడేవారు. కేవలం కమర్షియల్ సినిమాలు , లవ్ స్టోరీ సినిమాలు , ఫ్యాక్షన్ సినిమాలు మాత్రమే వచ్చేవి. ఈ సినిమా సంచలన విజయం సాధించి , మన తెలుగు సినిమాకు తిరుగులేని గుర్తింపు జాతీయ స్థాయిలో తీసుకొని రావడంతో , పెద్ద సినిమాలు రావడం మొదలయ్యాయి. నేను ‘బాహుబలి’ లాంటి సినిమా తీశానంటే , అందుకు కారణం ‘మగధీర’ ఇచ్చిన ధైర్యమే అని చెప్పుకొచ్చేవాడు రాజమౌళి.
ఇక రామ్ చరణ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి తీసిన #RRR చిత్రం వరల్డ్ వైడ్ గా ఎలాంటి సునామీ ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. మన ఇండియన్ సినిమాకు మొట్టమొదటి ఆస్కార్ అవార్డు ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మన టాలీవుడ్ కి హాలీవుడ్ లో మార్కెట్ ని ఏర్పాటు చేసిన చిత్రం కూడా ఇదే. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి రామ్ చరణ్ , రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లోపు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి అవ్వగానే రామ్ చరణ్ , రాజమౌళి కాంబినేషన్ లో సినిమా మొదలు అవ్వబోతుందని టాక్. ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యం లో ఉంటుందట.
రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘గరుడ’. బాహుబలి కి ముందే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ అప్పటికి మన టాలీవుడ్ కి మార్కెట్ ఆ స్థాయి లేకపోవడం తో , బడ్జెట్ కూడా అప్పటి మార్కెట్ స్టాండర్డ్స్ కే 500 కోట్లు రేంజ్ లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు మన టాలీవుడ్ మార్కెట్ కి అవధులు లేవు. ముఖ్యంగా రాజమౌళి క్రేజ్ కి ఇతర భాషల్లో తిరుగులేదు. ‘వారణాసి’ తో హాలీవుడ్ లో కూడా జెండా పాతేయబోతున్నాడు. తిరుగులేని మార్కెట్ ని సంపాదించుకున్న తర్వాత రామ్ చరణ్ తో ఈ సినిమా చేయబోతున్నాడు , ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయి అనేది మీరే ఊహించుకోండి.
