Rajamouli and Nani : రాజమౌళి(SS Rajamouli) తియ్యలేని సినిమా అంటూ ఏది లేదు. హాలీవుడ్ దర్శకులు కూడా తెరకెక్కించలేని సినిమాలు తీయగల సత్తా ఆయన సొంతం. అందుకే అవతార్, టైటానిక్ వంటి వెండితెర అద్భుతాలను తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్(James Cameron) వంటి వారు కూడా రాజమౌళి పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి లెజెండ్ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం. మహాభారతం స్టోరీలను మన దేశంలో ఇష్టపడని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతీ క్యారక్టర్ తో ఒక బాహుబలి లాంటి సినిమాని తీసేయొచ్చు. అంత అద్భుతమైన గాఢ అది. అలాంటి ప్రాజెక్ట్ ని తన విజన్ కి తగ్గట్టుగా తీస్తే వరల్డ్ సినిమా షేక్ అవుతుందని రాజమౌళి ఇప్పటికే అనేక సార్లు ఇంటర్వ్యూస్ ద్వారా తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ని మొదట్లో కొత్తవాళ్లతో చేస్తానని చెప్పుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తుంది.
Also Read : 100% స్ట్రైక్ రేట్ విషయంలో పవన్ ని దాటేసిన నేచురల్ స్టార్ నాని!
నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘హిట్ 3′(Hit : The Third Case) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను తియ్యబోయే మహాభారతం లో నాని(Natural Star Nani) కి కూడా ఒక క్యారక్టర్ కచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అయితే ఏ క్యారక్టర్ అనేది ఇప్పటి వరకు చెప్పలేదు కానీ, కచ్చితంగా నాని కి ఒక క్యారక్టర్ ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. పంచ పాండవులలో నకుల/ సహదేవుడు, ఈ రెండిట్లో ఒక క్యారక్టర్ ఆయనకు దక్కే అవకాశం ఉంది. ఇవి రెండు కాకుండా, అభిమన్యుడు క్యారక్టర్ కి కూడా నాని సరిపోతాడు. చూడాలి మరి ఆయనతో ఎలాంటి క్యారక్టర్ వేయించబోతున్నారు అనేది. ఇది వరకే రాజమౌళి నేను తీసే మహాభారతం లో జూనియర్ ఎన్టీఆర్ ని శ్రీ కృష్ణుడి పాత్రలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆయన దృష్టిలో ఇదే క్యారక్టర్ ఎన్టీఆర్ తో చేయించాలని ఉందో లేదో తెలియదు. కానీ ఎన్టీఆర్ మాత్రం కచ్చితంగా ఈ మహాభారతం లో ఎదో ఒక క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు అనేది మాత్రం స్పష్టం గా అర్థం చేఉస్కోవచ్చు.
అదే విధంగా కర్ణుడు రోల్ కి ప్రభాస్ సరిపోతాడని పలు ఇంటర్వ్యూస్ లో రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్రభాస్ కల్కి చిత్రం లో కర్ణుడి క్యారక్టర్ చేసాడు. రెస్పాన్స్ అదిరిపోయింది. కచ్చితంగా ఆ క్యారక్టర్ కి ఆయన సూట్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అర్జునుడి పాత్రలో కచ్చితంగా రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే ఆయన మహాభారతం సిరీస్ ని మొదలు పెట్టే అవకాశం ఉంది. ఒకటి కాదు రెండు కాదు సుమారుగా 8 భాగాలుగా ఈ మహాభారతం సిరీస్ ఉండే అవకాశం ఉంది. ప్రతీ ముఖ్యమైన క్యారక్టర్ కి ఒక సినిమా ఉంటుందట.
Also Read : పావలా పెట్టుబడికి రూపాయి లాభం… హీరో నాని పెద్ద ముదురు బాబోయ్!