Rajamouli: నిన్న ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ రాజమౌళి గురించి మాట్లాడుతూ… రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, అంతకు మించిన గొప్ప స్టోరీ టేలర్ అంటూ తెగ పొగిడాడు. అంతకు ముందు రోజు రణ్ బీర్ కపూర్ ఏకంగా రాజమౌళి కాళ్లు మొక్కాడు. నిజానికి ఒక డైరెక్టర్ ను పొగడటం సల్మాన్ కి అలవాటు లేదు. ఇక కాళ్ళు మొక్కడం రణ్ బీర్ కపూర్ జీవితంలోనే చేయలేదు.

కానీ, రాజమౌళి విషయంలో ఈ స్టార్లు కాంప్రమైజ్ అయ్యి జక్కన్నను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి గొప్ప మార్కెటింగ్ జీనియస్. తనను తానూ బాగా మార్కెట్ చేసుకున్నాడు. ఏ డైరెక్టర్ అయినా తన చిత్రాలను ప్రమోట్ చేసుకుంటాడు. కానీ, రాజమౌళి మాత్రం తన సినిమాలతో పాటు తనను కూడా మార్కెట్ చేసుకుంటాడు.
పైగా భారీ మార్కెట్ జరిగేలా చూడడంతో పాటు తన ప్రమోషనల్ స్ట్రాటజీల ద్వారా థియేటర్స్ కి ప్రేక్షకులను కూడా భారీ స్థాయిలో రప్పిస్తాడు. ప్రస్తుతం తన ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు ప్రధాన నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా పై అందరికీ ఆసక్తి రెట్టింపు అయింది.
అయినా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆర్ఆర్ఆర్ టీం మాత్రం క్రమం తప్పకుండా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఎలాగూ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ గా అలియా, అజయ్ దేవగన్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ నటనతో ఆకట్టుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి.. ఈ సినిమా థ్రిల్ చేయడం పక్కా.
Also Read: Rajamouli: నేను స్టుపిడ్… రాజమౌళి వింత ప్రవర్తన వెనుక కారణమేంటి!
పైగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో పాటు బీసీ ఆడియన్స్ కు కూడా సినిమాను చేరువ చేయడానికి రాజమౌళి పర్ఫెక్ట్ బీసీ ఆడియన్స్ కోసం ప్రమోషన్స్ ను డిజైన్ చేశాడు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతోంది. మరి చూడాలి ఏ రేంజ్ హిట్ అవుతుందో.
Also Read: BiggBoss5 Telugu: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?