
Bandi Sanjay vs Rajamouli : #RRR సినిమాకి అవార్డులు రికార్డులు మాత్రమే కాదు, వివాదాలు కూడా ఎక్కువే.రాజమౌళి సినిమాలకు ఇలాంటివి కొత్తేమి కాదు.గతం లో మదదీరా విషయంలో కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయి.అయితే #RRR మూవీ ‘కొమరం భీం’ టీజర్ విడుదలైనప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులూ చేసిన హంగామా మామూలుది కాదు.మతపరంగా జనాల్లో లేని విద్వేషాలను రెచ్చగొట్టే విధమైన చర్యలు తరుచూ చేస్తుండే బీజేపీ నాయకులకు ఏ చిన్న అవకాశం దొరికినా వివాదాలు సృష్టించి రాజకీయ మైలేజి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక షాట్ లో ‘ముస్లిం క్యాప్’ ని ధరించి కనిపిస్తాడు.అప్పుడు తెలంగాణ బీజేపీ అద్యక్ష్యుడు బండి సంజయ్ ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది.తెలంగాణ లో ఈ సినిమాని ఎలా విడుదల చేస్తారో నేను కూడా చూస్తా ఖబర్దార్ అంటూ అప్పట్లో పెద్ద హంగామా సృష్టించాడు.
ఆయన మాటలను అప్పట్లో రాజమౌళి మరియు హీరోలు ఈ విషయాన్నీ పట్టించుకోలేదు, కానీ రీసెంట్ గా రాజమౌళి దీనిపై స్పందించాడు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఏదైనా సినిమా మీద విమర్శలు రాకపోతే ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి లేదని నాకు అర్థమైంది. ఆర్ఆర్ఆర్ విషయంలో హీరోకు ముస్లిం క్యాప్ పెట్టినందుకు ఓ రైట్ వింగ్ పొలిటీషియన్ ఆ సీన్ తొలగించకపోతే థియేటర్లను తగులబెడుతామని నన్ను బహిరంగంగా కొడతానని హెచ్చరించాడు… ఇంకోవైపు నేను హిందూ జాతీయ వాదాన్ని ప్రచారం చేస్తున్నానని లెఫ్ట్ వింగ్ వాళ్లు నిందవేశారు.నాకు ఏవాదం నచ్చదు. నేను ఏవాదానికి చెందిన వాడిని కాదు. వాళ్లు తీవ్ర భావజాలం ఉన్న జాతీయవాదులు.. నకిలీ ఉదారవాదులు అని’ రాజమౌళి పరోక్షంగా బండి సంజయ్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా.ఒక విలేఖరి రీసెంట్ గా ఎన్టీఆర్ తో ఇంటర్వ్యూ చేస్తూ ‘మీరు ఈమధ్యనే అమిత్ షా ని కలిశారు కదా, కానీ గతం లో బీజేపీ తెలంగాణ అద్యక్ష్యుడు బండి సంజయ్ , హిందువుల మనోభావాలు దెబ్బతినేలా #RRR మూవీ ఉంది, దీనిని మేము తెలంగాణలో విడుదల చెయ్యనివ్వం అంటూ కామెంట్ చేసారు..దీనికి మీ స్పందన ఏమిటి’ అని అడగగా, ఎన్టీఆర్ దానికి సమాధానం చెప్తూ ‘ఏదైనా మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు చెయ్యడం కరెక్ట్ కాదు, సినిమా చూసిన తర్వాత ఆయనకీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, ఆ సన్నివేశాన్ని ఏ సందర్భం లో పెట్టామో అనేది.ఇక ఆయనే అర్థం చేసుకోవాలి గతం లో తాను చేసిన కామెంట్స్ సరైనదా కాదా అనేది’ అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు.