Rajamouli Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్య కథాంశం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన సినిమా కోసం ఎదురుచూసే రేంజ్ లో ఆయన సినిమాలను తెరకెక్కిస్తుంటారు… ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాతో ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటాడు. అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది. మహేష్ బాబు లాంటి నటుడి తో చేస్తున్న ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తోంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని రాజమౌళి అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎందుకంటే రాజమౌళి తెలుగు సినిమాలను చేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేసి మరి సినిమాలను చేశాడు. ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ వాళ్ళు చాలా వరకు వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు…ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం రాజమౌళి మూడో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆఫ్రికన్ అడవులను క్రియేట్ చేయడానికి ఆయన చాలావరకు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఎక్కువ మొత్తం లో ఈ షెడ్యూల్ కోసం ఖర్చు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇక్కడ జరగబోయే ఒక్క ఫైట్ కోసం దాదాపు 50 కోట్ల వరకు ఖర్చవుతోందట… ఈ సినిమాలో ఇదే కీలకం కాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: ఇంతకీ ‘విశ్వంభర’ లో విలన్ అతనేనా..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్!
మరి దానికి తగ్గట్టుగానే ఆయన ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించి సినిమా మొత్తం లో దీనిని వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు… హాలీవుడ్ ఫైటర్స్ ని కూడా ఇందులో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇందులో మరో హైలెట్ ఏంటి అంటే ఈ ఫైట్ మొత్తంలో మహేష్ బాబు డూప్ లేకుండా నటించబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక రాజమౌళి మహేష్ బాబుని ఏం చేయబోతున్నాడు అంటూ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కొంతవరకు కంగారు పడుతున్నారు… మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబుని విపరీతంగా వాడుతున్న రాజమౌళి మహేష్ బాబు కెరియర్ లోనే ఇప్పటివరకు రానటువంటి గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది…
మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని హాలీవుడ్ రేంజ్ లో చాలా గొప్ప గా ప్రూవ్ చేయబోతున్నాడా? అలాగే రాజమౌళికి మహేష్ బాబు కి ఎలాంటి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టబోతోంది అనేది కూడా కీలకంగా మారనుంది…