Dongalunnaru Jagratha- Rajamouli: రాజమౌళి కుటుంబం మొత్తం సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. ఆయన అన్నయ్య కీరవాణి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా కీరవాణి ఉన్నారు. ఇక కీరవాణికి ఇద్దరు కొడుకులు. శ్రీసింహ హీరో కాగా కాలభైరవ తండ్రికి మాదిరి మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. శ్రీసింహ ప్రయోగాత్మక చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యమదొంగ, మర్యాద రామన్న చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీసింహ ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. 2019లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.

మత్తు వదలరా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. అయితే ఆయన రెండవ చిత్రం తెల్లవారితే గురువారం నిరాశపరిచింది. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. శ్రీసింహ మూడో ప్రయత్నంగా మరో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. దొంగలున్నారు జాగ్రత్త టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది. కాగా దొంగలున్నారు జాగ్రత్త సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిందట. టాలీవుడ్ లో ఇంత వరకు ఈ జోనర్ లో సినిమా రాలేదట.
కాగా దొంగలున్నారు జాగ్రత్త చిత్రాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కి షో వేసి చూపించారట. శ్రీసింహ బాబాయ్ రాజమౌళి కూడా మూవీ చూశారట. సినిమా చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి కొన్ని మార్పులు సూచించారట. రాజమౌళి చెప్పిన సలహాలు పాటిస్తూ… సినిమాకు కొన్ని రిపేర్స్ చేశారట. మార్పులు చేశాక సినిమా మరింత స్ట్రాంగ్ గా తయారైందని హీరో శ్రీసింహ చెబుతున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి పర్యవేక్షణలో వస్తున్న ఈ మూవీ ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.

యువ దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సునీత తాటి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23న మూవీ విడుదల కానుంది. సరికొత్త జోనర్లో తెరకెక్కిన దొంగలున్నారు జాగ్రత్త మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని హీరో శ్రీసింహ వ్యక్తం చేశారు. మరోవైపు మహేష్ మూవీ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఆయన ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేస్తున్న రాజమౌళి పలు అంతర్జాతీయ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు.