S S Rajamouli: రాజమౌళి ప్రస్తుతం నార్వే దేశంలో ఉన్నారు. బాహుబలి 1 ప్రఖ్యాత స్టావెంజర్ కాన్సర్ట్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు వెళ్లారు. పనిలో పనిగా నార్వే దేశంలో గల పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. రాజమౌళి ఎప్పటి నుండో పల్ఫిట్ రాక్ ని సందర్శించాలని అనుకుంటున్నారట. మగధీర మూవీ కోసం లొకేషన్స్ ఎంపిక చేసే క్రమంలో ఈ ప్రదేశం చూశారట. అప్పటి నుండి పల్ఫిట్ రాక్ కి రావాలనే కోరిక రాజమౌళిలో ఉందట.
ఆ కోరిక బాహుబలి 1 స్క్రీనింగ్ కారణంగా ఇప్పటికి తీరిందన్న రాజమౌళి అక్కడ భార్యతో పాటు సాహసాలు చేశారు. కొండ అంచున కూర్చుని థ్రిల్ ఫీలయ్యాడు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఆ ప్రదేశాన్ని సందర్శించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దంపతుల ఫోటోలు చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడుతున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి అరుదైన మైళ్ళురాళ్లు చేరుకున్నారు. ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి భారతీయ సినిమా తలెత్తుకునేలా చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.
దీంతో రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి హీరో మహేష్ బాబుతో ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్న రాజమౌళి త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటారట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్న ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 కోట్లని సమాచారం.
View this post on Instagram