Rajamouli New Car: విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళికి కారు కొనడం పెద్ద విషయం ఏమి కాదు. కానీ, రాజమౌళి తాజాగా కొత్త కారు కొనడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. డైరెక్టర్ రాజమౌళి తన గ్యారేజ్ లోకి వోల్వో XC 40 ఎస్ యూవీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని వోల్వో కార్స్ ఇండియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వెల్లడించింది.

రాజమౌళికి కారును అందిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. గొప్ప దర్శకుడు, రచయిత రాజమౌళి గారికి వోల్వో ఫ్యామిలీలోకి స్వాగతమంటూ రాసుకొచ్చింది. ఆయన దృక్పథంలాగే సౌకర్యవంతమైన ప్రయాణాలు వారికి కలగాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఇంతకీ భారతదేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర ఎంతో తెలుసా ? రూ. 44.50 లక్షలు.
అలాగే వోల్వో ఎక్స్‌సి40 ఇంజన్ అండ్ పవర్ గురించి మీకు తెలిస్తే షాక్ అవుతారు. 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ వోల్వో XC40లో ఉంటుంది ఇది. ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ట్రానిక్స్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన XC40 కూడా కంపెనీ కొన్ని నెలల్లో ఇండియాలో పరిచయం చేయనుంది.
పైగా ఈ కార్ పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనం. అలాగే ఈ కారుకి లుక్ కలర్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ముందుగా వోల్వో XC40 లూక్స్ అండ్ డిజైన్ గురించి చూస్తే.. కంపెనీ సిగ్నేచర్ T-ఆకారపు DRL, గ్లోస్ బ్లాక్‌లో సింగిల్-ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. ఇంకా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ఉన్న మందపాటి ప్లాస్టిక్ క్లాడింగ్ XC40కి కఠినమైన రూపాన్ని ఇస్తుంది.

రాజమౌళి కారు ఫ్యూజన్ రెడ్ కలర్ విత్ బ్లాక్‌లో పెయింట్ చేయబడింది, ఇది మంచి కాంట్రాస్ట్‌ని తెస్తుంది. అంతే కాకుండా, ఈ కారు నాలుగు ఇతర కలర్స్ ఆప్షన్స్ లో కూడా లభిస్తుంది – ఒనిక్స్ బ్లాక్, డెనిమ్ బ్లూ, గ్లేసియర్ సిల్వర్ అండ్ క్రిస్టల్ వైట్. మొత్తానికి కొత్త కారుతో రాజమౌళి అదరగొట్టాడు.