KGF Chapter2: ప్రపంచవ్యాప్తంగా నేడు KGF చాప్టర్ 2 ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుందో మన అందరికి తెలిసిందే..ముఖ్యం గా బాలీవుడ్ మార్కెట్ లో ఈ సినిమా రికార్డ్స్ వైపు చూడాలన్న అక్కడి స్టార్ హీరోలకు వణుకు పుట్టే రేంజ్ లో ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే భవిష్యత్తు లో మన దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమదే అందరికంటే పై చెయ్యి అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ ఏడాది పుష్ప సినిమాతో ప్రారంభం అయినా దక్షణాది సినీ పరిశ్రమ డామినేషన్ #RRR తో పీక్ స్థాయి కి చేరుకుంది..ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అల్ టైం టాప్ 3 చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది..ఇప్పుడు KGF చాప్టర్ 2 కూడా అతి త్వరలోనే #RRR మూవీ వసూళ్లను దాటి టాప్ 3 చిత్రాలలో ఒక్కటిగా నిలవబోతుంది..ఇది ఇలా ఉండగా KGF చాప్టర్ 2 లాభాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అవుతున్న ఒక్క వార్త ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలం కమిషన్ బేసిస్ మీదనే జరిగింది అట..అంటే ఈ సినిమా హక్కులను ఒక్క ప్రాంతానికి కూడా అమ్మలేదు..వచ్చిన గ్రాస్ వసూళ్ళలో టాక్సలు మరియు థియేటర్స్ రెంట్లు పోను మిగిలిన వసూళ్ళలో డిస్ట్రిబ్యూటర్లకు మరియు చిత్ర నిర్మాతకి 50 – 50 షేర్ అన్నమాట..ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు గాను 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది..ఇందులో నిర్మాతలకు కేవలం ఈ 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి..#RRR సినిమాని రాజమోళి దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు..అలా రాజమౌళి ఒక్క సినిమాకి చేసే ఖర్చుని కేవలం KGF చాప్టర్ 2 వారం రోజులు కూడా గడవకముందే లాభాల రూపం లో ఆర్జించింది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ సినిమా నిర్మాతలు ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకొని..విడుదలకి ముందు విపరీతమైన క్రేజ్ ఉన్నా..వివిధ ప్రాంతాల నుండి ఈ సినిమాని ఫాన్సీ రేట్స్ తో కొనడానికి క్యూ కట్టినా..ఎవ్వరికి అమ్మకుండా , కమిషన్ బేసిస్ మీద విడుదల చేసి ఈ స్థాయి లాభాలు ఆర్జించడం అంటే మాములు విషయం కాదు..నిజంగా ఈ సినిమాని నిర్మించిన హోమబుల్ సంస్థ వారికి సెల్యూట్ చెయ్యాల్సిందే.
Also Read: Acharya Pre Release Business: అఫీషియల్ : ‘ఆచార్య’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే !
KGF చాప్టర్ 2 ని ప్రశాంత్ నీల్ గారు కేవలం 100 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారు..100 కోట్ల బడ్జెట్ తో ఆయన 300 కోట్ల రూపాయిల రేంజ్ క్వాలిటీ ని వెండితెర మీద చూపెట్టి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసాడు..నేడు ఆ సినిమా థియేటర్స్ నుండే నిర్మాతలకు ఫుల్ రన్ లో 800 కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించి పెట్టింది..ఇక అన్ని భాషలకు కలిపి థియేట్రికల్ మరియు డిజిటల్ రైట్స్ అన్ని కలుపుకొని కేవలం ఈ ఒక్క సినిమానుండే నిర్మాతలు దాదాపుగా 1000 కోట్ల రూపాయిల లాభాలను రప్పించుకునేలా ఉన్నారు..ఇదే కనుక జరిగితే ఇండియాలోనే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన ఏకైక సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించినట్టే..KGF సిరీస్ తో బాక్స్ ఆఫీస్ ని ఈ స్థాయి లో శాసించిన ప్రశాంత్ నీల్ ఇక ప్రభాస్ తో తియ్యబోయ్యే సలార్ సినిమాతో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి..ఇప్పటికే 30 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చెయ్యబోతున్నాడు.
Also Read: Byreddy Siddharth Reddy: వైసీపీకి బైరెడ్డి బైబై.. టీడీపీ గూటికి ఫైర్ బ్రాండ్ సిద్ధార్థ్ రెడ్డి