Raja Saab Movie Climax: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులకు మంచి అంచానాలు ఉన్నాయి. కానీ సగటు ప్రేక్షకులు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలను పెట్టుకోలేదు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా భారీ హైప్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఎలా ఉన్నా పర్లేదు ఒకసారి అయితే చూడచ్చు అనే ధోరణిలో సగటు ప్రేక్షకులు ఉన్నారు. ఇక దానికి తోడుగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ను కనక చూస్తే ఇందులో ప్రభాస్ సినిమాలో ఘోస్ట్ గా కనిపించబోతున్నాడు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ప్రభాస్ జోకర్ గా కనిపించబోతున్నాడనే విషయాన్ని కూడా మారుతి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమాలోని క్లైమాక్స్ సీన్ జోకర్ సినిమాలో నుంచి కాపీ చేశారు అంటూ కొన్ని కామెంట్లయితే వస్తున్నాయి. ఇక దాని మీద సరైన క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ జోకర్ సినిమాలోని సీన్స్ ను ఇందులో పెడితే మాత్రం ఈ సినిమా భారీ గా నిరాశపరిచే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే ఇప్పటికే చాలా మంది జోకర్ సినిమాను చూశారు. జోకర్ నటునేను చూశారు. ప్రభాస్ జోకర్ ను మరిపించేలా యాక్టింగ్ చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం జోకర్ ముందు ప్రభాస్ తేలిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
అలా కనక అయితే ఈ సినిమా మీద భారీగా నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి… కాబట్టి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఈ సినిమా అతనికి ఎలాంటి గుర్తింపును ఇవ్వబోతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…