హీరో రాజ్ తరుణ్ హీరోగా మారడానికి అసలు కష్టపడలేదు. అదృష్టమో లేక అవకాశమో తెలియదు గానీ చాల ఈజీగా లైఫ్ లో హీరోగా సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం సినిమాలు తగ్గాయి, హిట్లూ లేవు. అందుకే మళ్ళీ జనాన్ని మెప్పించాలి, ఈ క్రమంలో మనోడు ఆలోచించుకున్న ఆలోచన ఏమిటి అయ్యా అంటే.. ఓటీటీల్లో నటించాలని, కాకపోతే ఇంతవరకు ఎవ్వరూ తనను సంప్రదించట్లేదట.
సినిమాల్లో తానూ ఇప్పటివరకూ చేయలేని ప్రయోగాల్ని వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లో చేయొచ్చని ఈ కుర్రడు ఆశ పడుతున్నాడు. నేను వెబ్ సిరీస్ లు చేస్తాను మహాప్రభో అంటూ ఆ మధ్య రాజ్ తరుణ్ తెగ ఎనౌన్స్ చేశాడు. అయినా ఓటీటీ ఒరిజినల్ మూవీస్ కోసం అతన్ని ఎవ్వరూ సంప్రదించలేదు. ఒక హీరో చేయడానికి రెడీగా ఉన్నాను అన్నా.. ఎవరూ చేయమని అడగలేదు అంటే.. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్ధమవుతుంది.
నిజానికి ఓటీటీలో మంచి ప్రయోగాలు చేయొచ్చు నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం అంటూ రాజ్ తరుణ్ సొల్లు చెబుతున్నా.. అసలు విషయం ఏమిటంటే.. ఓటీటీల్లో నటించి అక్కడ ఆడియన్స్ ను మెప్పిస్తే.. కనీసం తనతో ఎవరైనా సినిమా చేసే అవకాశం ఉందని ఆలోచిస్తున్నాడు. పైగా హీరోగా అవకాశాలు రాకపోతే.. ఇక సినిమాల్లో విలన్ పాత్రలు కూడా నటిస్తానంటూ ఇప్పటికే మేకర్స్ కి మెసేజ్ లు పాస్ చేశాడు.
నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలన్నా.. విలన్ లుక్స్ ఉండాలి కదా.. పైగా బాడీ కూడా ఫిట్ గా కండలు తిరిగి ఉండాలి. కానీ రాజ్ తరుణ్ ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఏమైనా ఒకసారి ప్లాప్ హీరో అని ముద్రను వేయించుకున్న తరువాత, ఇక అతను ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇక అతను ఏమి చేసినా కూడా ఎవ్వరూ ఇష్టపడరు.