Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణకి కాస్త తిక్క ఉంది. ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. పైగా మనోడు మంచి డ్రింకర్ కూడా. కాస్త మత్తు ఎక్కువైతే.. ట్విట్టర్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా అలాంటి కామెంట్స్ పెట్టి.. మొత్తానికి ఈ రోజు సినిమా వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇంతకీ రాహుల్ రామకృష్ణ ఏమి ట్వీట్ పెట్టాడు అంటే.. ‘ఇక మీదట సినిమాల్లో నటించనని వెల్లడించాడు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఎవరేమనుకున్నా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Also Read: ఉద్యోగుల డిమండ్లు నెరవేరుస్తారా? ఎస్మా ప్రయోగిస్తారా?
‘అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు’ వంటి చిత్రాలతో రాహుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి ఎవ్వరేమన్నా ఇక సినిమాల్లో నటించను, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంటూ చెబుతున్న రాహుల్ రామకృష్ణ భవిష్యత్తులో ఏమి చేస్తాడో చెప్పలేదు. సరే.. మనోడు ఎలాంటోడు అయినా.. కమెడియన్గా, నటుడిగా రాహుల్ రామకృష్ణ తనేంటో నిరూపించుకున్నాడు.
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022
అయితే, కెరీర్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్న సమయంలో సడెన్ గా ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చూడాలి. ఇక రాహుల్ రామకృష్ణ సన్నిహితులు మాత్రం వాడు మాట మీద నిలబడే రకం కాదు అని ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. రాహుల్ గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ నే చేశాడు. ఆ తర్వాత వెంటనే.. ఆ కామెంట్స్ ను మర్చిపోయాడు.