ఈ ఫోటోలో అఘోరాగా కనిపిస్తోంది ఒక హీరో అని తెలిసి నెటిజన్లు ఒళ్ళు గగుర్పొడిచింది. ఏమిటి.. హీరోనా ? ఎవరు ఆ హీరో..? వైవిధ్యానికి పర్యాయపదం ఆ హీరో. ఎవరై ఉంటారు ఆ హీరో.. ‘రాఘవ లారెన్స్’. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. డ్యాన్సర్ గా ఎదిగి.. దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న నిఖార్సయిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ ‘రాఘవ లారెన్స్’.
సహజంగా ప్రేక్షకులను భయపెట్టడమే తన సక్సెస్ గా మార్చుకున్న రాఘవ లారెన్స్, ఇలాంటి లుక్ లో ఒక సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అఘోరా కూడా ఇంకా సాఫ్ట్ గా కనిపిస్తాడేమో. కానీ, లారెన్స్ మాత్రం ఈ లుక్ లో అఘోరాలనే భయపెట్టేలా ఉన్నాడు. ఇంతకీ ఈ పోస్టర్ ఏ సినిమాలోది అంటే.. లారెన్స్ ప్రస్తుతం చేస్తోన్న ‘దుర్గ’ సినిమాలోది.
#Durga !!!
Need all your blessings 🙏🏻 pic.twitter.com/pVYNepkgFM
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021
రాఘవ లారెన్స్ ఈ సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ లుక్ పోస్టర్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వెంటనే.. ఇవి వైరల్ గా మారాయి. పోస్టర్ లో లారెన్స్ అఘోరా వేషంలో కనిపించడంతో అందరికీ ఆసక్తి కలిగింది. మొత్తానికి ఈ పోస్టర్ ను చూస్తుంటే.. ఈ సినిమా కూడా లారెన్స్ తనకు బాగా కలిసొచ్చిన హారర్ నేపథ్యంలోనే తీస్తున్నట్లు అనిపిస్తోంది.
అయితే, ఈ సినిమాలో రాఘవ నటిస్తూ.. స్క్రిప్ట్ రాస్తున్నా.. దర్శకత్వ బాధ్యతల జోలికి మాత్రం వెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమాకి దర్శకత్వం వహించే దర్శకుడి పేరును కూడా అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే లారెన్స్ ‘ముని, కాంచన, గంగ(కాంచన 2), కాంచన 3’ వంటి సినిమాలతో హారర్ నేపథ్యంలో తిరుగులేని హీరోగా వరుస సక్సెస్ లు అందుకున్నాడు. కాబట్టి, ఈ కొత్త హారర్ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది.
#Durga second look! #RagavendraProductions pic.twitter.com/XjNhGhmylU
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More