Homeఎంటర్టైన్మెంట్Raghava Lawrence: జై భీమ్ సినిమా నిజ జీవిత పాత్ర "పార్వతమ్మ" కు... ఇల్లు కట్టిస్తా...

Raghava Lawrence: జై భీమ్ సినిమా నిజ జీవిత పాత్ర “పార్వతమ్మ” కు… ఇల్లు కట్టిస్తా అన్న రాఘవ లారెన్స్

Raghava Lawrence: సినిమా బాగుందని చెప్పి మూవీ యూనిట్ ని పొగిడే వారు తప్ప నిజ జీవిత పాత్రల్ని ఎప్పుడు ఎవరు పట్టింకుకోరు. అవార్డులు, రివార్డులు అన్నీ సినిమాకే. వారి పారితోషకల్లో 10 శాతం నిజ జీవిత పాత్రలకు వచ్చిన వారి జీవితం బాగుండేది అనిపిస్తుంది. కానీ అవి అందరి కధలకు కాదు. కొన్ని జీవిత గాధలు హృదయాన్ని కదిలిస్తాయి. అలాంటి వాటిని తెరమీదకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న హీరోలు, దర్శక నిర్మాతలకు ముందుగా ధన్యవాదలు చెప్పాలి. అలా తీసిన తాజా సినిమానే జై భీమ్. సూర్య ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమా పలువురు సినీ ప్రముఖులు, విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటోంది. ఓ గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు… ఆ మహిళకు అండగా నిలిచే లాయర్ పాత్రలో సూర్య నటించాడు. ఇందులో సినతల్లి పాత్రలో నటించిన లొజోమోల్ జోస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. తాజాగా ఈ సినిమా చూసిన రాఘవ లారెన్స్ ఎంతో చలించిపోయాడు.

raghava lawrence promise to build a house to jai bhim parvathamma

అసలు రాజన్న భార్య పార్వతీ అమ్మాళ్ ప్రస్తుతం ఉన్న ధీన పరిస్థితికి కన్నీరు పెట్టుకున్నారు. ముసలితం వచ్చినా కూడా ఇప్పటికీ ఆమె ఓ పూరి గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ ఉండడం చూసి చాలా బాధపడ్డారు. సినిమాలో మాత్రం ఆమె ఇల్లు కట్టుకొని ఉంటున్నట్లు చూపించారు. కానీ ఆమె మాత్రం నిజ జీవితంలో గుడిసె లోనే బతుకుతుంది. అందరూ సినిమాను పొగుడుతున్నారు, వీరి జీవితాలపై వారు సినిమాను నిర్మించడం మంచి విషయమే అయిన  కానీ లాభపడింది మాత్రం సినిమా బృందమే. అసలు పార్వతి ఇప్పుడు ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి అని ఒక్కరూ కూడా ఆలోచించట్లేదు. నటించిన వారిని పొగుడుతున్నారు తప్ప… వారిని పట్టించుకోవట్లేదు. కానీ లారెన్స్ మాత్రం అలా చేయలేదు.

రాఘవ లారెన్స్  సొంత ఇల్లు కట్టిస్తున్నట్టు తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. అంతేకాకుండా దర్శకుడు లారెన్స్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. అలాగే చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటామని లారెన్స్ తెలిపారు. సిన తల్లి పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయా అని చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక లారెన్స్ తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version