Homeఎంటర్టైన్మెంట్Radhika Sarathkumar: చిరంజీవి కంటే అతనే గొప్ప నటుడు అంటూ సీనియర్ హీరోయిన్ రాధికా హాట్...

Radhika Sarathkumar: చిరంజీవి కంటే అతనే గొప్ప నటుడు అంటూ సీనియర్ హీరోయిన్ రాధికా హాట్ కామెంట్స్!

Radhika Sarathkumar: తెలుగు, తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా గత నాలుగు దశాబ్దాల నుండి ఆడియన్స్ ని అలరిస్తూ, ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న హీరోయిన్స్ లో ఒకరు రాధికా శరత్ కుమార్(Radhika Sarathkumar). అద్భుతమైన నటన తో పాటు, అభినయం కూడా ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ముఖ్యంగా ఈమె ఆరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చేసిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాయి. వీళ్లిద్దరి కలయిక లో దాదాపుగా పాతికకు పైగా సినిమాలు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, వీళ్లిద్దరి కాంబినేషన్ ఎంతటి హిట్ అనేది. చిరంజీవి తో అన్ని సినిమాల్లో కలిసి పని చేసిన అనుభవం కారణంగా, వీళ్లిద్దరు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ఎంతలా అంటే ఆమె భర్త శరత్ కుమార్ అప్పుల్లో ఉన్న రోజుల్లో చిరంజీవి సహాయం చేసేంతలా అన్నమాట.

ఎన్నో ఏళ్ళ నుండి వీళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం అలా కొనసాగుతూ వచ్చింది. అంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా, చిరంజీవి కంటే అతనే గొప్ప నటుడు అంటూ రాధికా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సీనియర్ హీరోయిన్ సుహాసిని అప్పట్లో ఒక టాక్ షో ని నిర్వహించింది. ఈ టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాధికాని ఆమె కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది. అందులో చిరంజీవి, మోహన్ లాల్, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడగ్గా, అందుకు రాధికా క్షణం కూడా ఆలోచించకుండా మోహన్ లాల్ పేరు చెప్పేస్తుంది. మోహన్ లాల్ ఇండియా లోనే బెస్ట్ నటులలో ఒకరని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అదే విధంగా కమల్ హాసన్, మోహన్ లాల్ లలో ఎవరు ఉత్తమ నటుడు అని అడగ్గా, ఆమె కమల్ హాసన్ పేరు చెప్తుంది.

ఇక చివర్లో కమల్ హాసన్, శరత్ కుమార్ లలో ఎవరు ఉత్తమ నటుడు అని అడగ్గా, కమల్ హాసనే బెస్ట్ యాక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. శరత్ కుమార్ రాధికకు భర్త అవుతాడు. అయినప్పటికీ ఆయన పేరు చెప్పకుండా, కమల్ హాసన్ పేరు చెప్పింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, రాధికా నిజాయితీ గా చెప్పింది , చిరంజీవి ని తక్కువ చేసే ఉద్దేశ్యంతో చెప్పలేదు అని. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం రాధికా మాటలకు అసలు ఏకీభవించడం లేదు. చిరంజీవి లాంటిది నటుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే లేరని, ఆయన లాగా డ్యాన్స్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ చేసే హీరోలను ఇప్పటి వరకు చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular