Radhika Apte: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. ఒక్కో తరంలో ఒక్కో హీరోయిన్ తన హవాని చూపిస్తూ ప్రేక్షకులను మైమరిపింపజేస్తుండడం విశేషం… ఇక ఒకానొక సమయంలో రాధిక ఆప్టే సైతం ప్రేక్షకులను అలరించే సినిమాలను చేసింది. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆమె పెద్దగా సినిమాలను చేయలేకపోయింది. కారణం ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆయన తనని వేధించాడని, రాత్రి హోటల్లో పడుకుంటే తాగి ఆ హోటల్ డోర్స్ కూడా కొట్టేవారని, తీయకపోతే బీభత్సం చేస్తూ నానా రచ్చ చేసేవారట.అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నానని ఆమె పలు సందర్భాల్లో తెలియజేసింది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఇక ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికి ఆమెకి సక్సెసులు మాత్రం దక్కడం లేదు. మొత్తానికైతే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవడం అనేది ఒకరకంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
ఇక గతంలో ఆమె రక్త చరిత్ర, ఎంఎస్ ధోని, లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లో నటించింది. మొత్తానికైతే ఆమె చేసిన ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ తాలూకు పొటెన్షియాల్టీ తెలిసేలా నటించేది. అందుకే ఆమెకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నప్పటికి ఆమె ఆశించిన మేరకు స్టార్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది.
ఇక ప్రతి విషయంలో ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేది. అది నచ్చక చాలామంది దర్శక నిర్మాతలు ఆమె ను సినిమాల్లో తీసుకోలేదు… మొత్తానికైతే ఒకప్పుడు ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆమెకు ఏదైనా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నప్పటికి ఆమెను తీసుకోడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతుండటం విశేషం…ఇక గతంలో ఆమె బోల్డ్ కంటెంట్ సినిమాలు కూడా చేసింది. అవి కూడా ఆమెకు ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టకపోవడంతో ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా ఆదరణ దక్కకుండాపోయింది…