Radhe Shyam: నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలి ? నేషనల్ రేంజ్ లో ఉండాలి. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే శ్యామ్’ జనవరి 14న రిలీజ్ కాబోతుంది. అనగా ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం కూడా లేదు. కానీ ‘రాధే శ్యామ్’ టీం మాత్రం తమ సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రమోషన్స్ లో బాగా వెనుకబడింది.
ఇప్పటివరకు ‘రాధే శ్యామ్’ నుంచి కేవలం పోస్టర్స్, చిన్నపాటి టీజర్ తప్ప, ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. ఎందుకో సినిమా టీం కూడా ప్రమోషన్స్ విషయంలో అసలు హడావిడి చేయడానికి ఇష్టపడట్లేదు. జనవరి 7న విడుదల కానున్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్” పై మంచి అంచనాలు ఉన్నాయి. అయినా ఆర్ఆర్ఆర్ బృందం ప్రమోషన్స్ వేటలో పడింది.
పైగా వరుసగా సాంగ్స్ వదులుతూ సినిమా పై జనంలో అంచనాలను పెంచుతున్నారు. మరి ‘రాధే శ్యామ్’ టీమ్ ఎందుకు ఇంకా సైలెంట్ గా ఉంది ? అసలుకే ‘రాధే శ్యామ్’పై ఎలాంటి అంచనాలు లేవు. దానికి తోడు సినిమా పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేయాలి. ఒకపక్క డిసెంబర్ లో వస్తున్న “పుష్ప”, “అఖండ” సినిమాలు ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నాయి.
రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాలు ఇంకా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తాయి. కాబట్టి పబ్లిసిటీ పరంగా ఇప్పటి నుంచే ‘రాధే శ్యామ్’ దూసుకుపోతే మంచిది. కానీ ‘రాధేశ్యామ్’ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. అసలు పాన్ ఇండియా సినిమాలకు ఓపెనింగ్స్ చాలా కీలకం. ప్రభాస్ పేరు చాలు జనం ఆటోమేటిక్ గా వస్తారనే ధీమా ఉండటం అంత తెలివైన పని అనిపించుకోదు.
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో దొంగతనం, బెంబేలెత్తిపోయిన కాజల్
ఇప్పటికే ‘రాధే శ్యామ్’ సినిమా పై జనం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పైగా రాధాకృష్ణ కుమార్ అనే కొత్త దర్శకుడు తీసిన సినిమా ఇది. అందుకే అందరికీ ఈ సినిమా పై అనేక అనుమానాలు ఉన్నాయి.