Radhe Shyam Box Office Collection: ‘రాధేశ్యామ్’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘రాధేశ్యామ్’ సినిమా ఫస్ట్ డే మరియు సెకండ్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. అలాగే మూడో రోజు కూడా భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 7000 స్క్రీన్ లలో విడుదల అయిన ‘రాధేశ్యామ్’ చాలా చోట్ల బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.57 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అదే విధంగా సెకండ్ డేన కూడా రూ.40 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టింది. ఇక మూడో రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఏరియాల వారీగా చూస్తే..
Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్
ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ మూడో రోజు కలెక్షన్స్ :
నైజాం – 8.40 కోట్లు
సీడెడ్ – 6.46 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.35 కోట్లు
గుంటూరు – 2.70 కోట్లు
ఈస్ట్ గోదావరి – 1.43 కోట్లు
వెస్ట్ గోదావరి – 2.30 కోట్లు
కృష్ణ – 1.51 కోట్లు
నెల్లూరు – 3.56 కోట్లు

మూడో రోజు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమా ‘రాధేశ్యామ్’ కావడం విశేషం. ప్రస్తుతం మరో రెండు వారాలు వరకూ ఏ భారీ సినిమా రిలీజ్ కి లేకపోవడం ఈ సినిమాకు ఇంకా బాగా కలిసి రానుంది.
ఏది ఏమైనా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఆ అంచనాలను చాలా తేలికగా అందుకుంది. సినిమాపై ఉన్న హైప్ ను చాలా ఈజీగా అందుకుంది. పైగా భారీ హైప్, సోలో రిలీజ్, విపరీతంగా చేసిన ప్రమోషన్లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
Also Read:త్రివిక్రమ్ అడ్డు లేదు.. ఇక అందర్నీ వచ్చేయమంటున్నాడు
[…] NTR Koratala Siva Movie: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమా కోసం కొరటాల భారీ తారాగణాన్ని తీసుకోబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా అలియా భట్ తో పాటు మరో హీరోయిన్ ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. […]
[…] AP New Districts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాల విభజనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నిస్తోంది. జిల్లాల ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని పిల్ దాఖలు చేశారు. […]
[…] SS Rajamouli: రాజమౌళి.. క్రియేటివిటీకి అండ్ విజువల్ సెన్స్ కి సింబాలిజం, కమర్షియల్ సినిమాలకు రాజమౌళి పర్ఫెక్ట్ డెఫినిషన్.. రాజమౌళి డైరెక్షన్ లో ఒక భారీ తనం ఉంటుంది, రాజమౌళి పాత్రల్లో అద్భుతాలు ఉంటాయి. రాజమౌళి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. రాజమౌళి మాస్ ఎలిమెంట్స్ లో ఒక విజన్ ఉంటుంది. అందుకే.. ‘రాజమౌళి’ అనే పదమే ఒక బ్రాండ్ అయింది. […]
[…] Prabhas Salaar Movie: హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రానున్న ‘సలార్’ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుంది బాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఎవరు ఆ క్రేజీ బ్యూటీ అనేగా ? ‘సారా అలీ ఖాన్’. సలార్ లో ప్రభాస్ ప్రేయసిగా సారా అలీ ఖాన్ నటించబోతుంది. అలాగే ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా సారా అలీ ఖాన్ నటిస్తోందట. […]
[…] OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వంతో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి సందD మూవీతో సక్సెస్ సాధించిన రోషన్‌కు మరో సూపర్బ్ అవకాశం దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె కూడా ఇదే బ్యానర్‌లో వస్తోంది. […]
[…] […]