Race Gurram Villain Ravi Kishan Daughter: గడిచిన దశాబ్ద కాలం లో మన టాలీవుడ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన రేస్ గుర్రం చిత్రం కచ్చితంగా ఉంటుంది.ఇందులో అల్లు అర్జున్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, విలన్ గా నటించిన రవి కిషన్ పాత్రకి కూడా అంతే మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.
రవి కిషన్ భోజ్ పూరి లో పెద్ద స్టార్ హీరో, అక్కడ ఆయన హీరో గా నటించిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కేవలం సినీ రంగం లోనే కాదు, రాజకీయ రంగం లో కూడా రవి కిషన్ గొప్పగా రాణించాడు. 2019 వ సంవత్సరం లో బీజేపీ పార్టీ లో చేరి, గోరఖ్ పూర్ స్థానం నుండి ఎంపీ గా అత్యంత భారీ మెజారిటీ తో గెలుపొంది చరిత్ర సృష్టించాడు.
ఇక పోతే రవి కిషన్ సినిమాల్లో హీరోగా కొనసాగుతున్న రోజుల్లోనే ప్రీతీ శుక్లా ని ప్రేమించి పెళ్లాడాడు. ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు మరియు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇది ఇలా ఉండగా రవి కిషన్ చిన్న కూతురు ఇషితా రీసెంట్ గానే భారత సైన్యం లో చేరింది. ఈమెకి కేవలం 21 ఏళ్ళు మాత్రమే. తండ్రి సినీ నటుడు మరియు ఎంపీ, సంపూర్ణంగా ఎంజాయ్ చేసే యవ్వనపు వయస్సు.
ఇంత చిన్న వయస్సులో కూడా ఆమె దేశ సరిహద్దుల్లో నిలబడి సేవలు అందించాలి అనుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. దీనిని బట్టీ రవి కిషన్ చిన్నతనం నుండే తన పిల్లలకు దేశ భక్తి ని నరనరాల్లో ఎక్కించాడు అనేది అర్థం అవుతుంది. చిన్న వయ్స్సులోనే దేశానికీ సేవలు అందించాలి అనుకోవడం, అందుకు రవి కిషన్ సంపూర్ణంగా ప్రోత్సహించడంతో, సోషల్ మీడియా లో నెటిజెన్స్ తండ్రి కూతుర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.