Sieze the Ship Dialogue : ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ ఏది చేసిన సంచలనమే. ఒకప్పుడు కూడా ఇలాగే ఉండేది కానీ, అది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న కొన్ని పనులు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. మొన్న ఢిల్లీ టూర్ కి వెళ్లి కేంద్ర మంత్రులందరితో భేటీ అవ్వడం, ఆ తర్వాత వెంటనే కాకినాడ పోర్ట్ లో వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వార్త ని తెలుసుకొని, హుటాహుటిన కాకినాడ పోర్ట్ కి వెళ్లి, అప్పటికే సముద్రంలో 9 కిలోమీటర్ల దూరం వెళ్లిన షిప్ ని ఒక చిన్న బోట్ లో ఛేజ్ చేసి పట్టుకొని షిప్ ని సీజ్ చేసారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అధికారులకు వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ‘సీజ్ ది షిప్’ అన్న డైలాగ్ నేషనల్ వైడ్ గా ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.
యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ వీడియోస్ కి వేరే లెవెల్ లో వ్యూస్ వచ్చాయి. కచ్చితంగా ఈ డైలాగ్ తో సినిమా వస్తుందేమో అని అందరూ ఊహించారు. ఊహించిన విధంగానే త్వరలోనే ఈ టైటిల్ తో ఒక సినిమా రాబోతుంది. నేడు ఫిల్మ్ ఛాంబర్ లో ఆర్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ అనే సంస్థ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకుంది. త్వరలోనే ఈ టైటిల్ మీద గ్రాండ్ గా సినిమా తియ్యబోతున్నారట. హీరో ఎవరు అనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్. ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నితిన్ పవన్ కళ్యాణ్ ని ఎంతలా ఆరాధిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇండస్ట్రీ లో ఎంతోమంది కుర్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ చివరి షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. గత ఆరు నెలల నుండి ఆయన గెడ్డం లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా కోసం ఆ గెడ్డం తీసేసి, కోరమీసం లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఆయన అదే లుక్ లో కనిపించడంతో అభిమానులు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పవన్ కళ్యాణ్ పాడిన పాటని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఓజీ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాలు కూడా ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనవి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలు ఎంతమేరకు సక్సెస్ సాధించబోతున్నాయో చూడాలి.