https://oktelugu.com/

Pushpa OTT: ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి ‘పుష్ప’ స్ట్రీమింగ్..!

Pushpa OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ అభిమానుల భారీ అంచనా మధ్య రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం మూడో వారం పూర్తి చేసుకొని నాలుగో వారం రన్ దిశగా పరుగులు తీస్తోంది. విడుదలకు ముందే భారీ బిజినెస్ ‘పుష్ప’కు తొలిరోజే మిక్స్ డ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెంట్ సాధించే కొంత కష్టపడాల్సి వచ్చింది. తెలుగులో టికెట్ల రేట్ల తగ్గింపు కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 7, 2022 / 12:47 PM IST
    Follow us on

    Pushpa OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ అభిమానుల భారీ అంచనా మధ్య రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం మూడో వారం పూర్తి చేసుకొని నాలుగో వారం రన్ దిశగా పరుగులు తీస్తోంది. విడుదలకు ముందే భారీ బిజినెస్ ‘పుష్ప’కు తొలిరోజే మిక్స్ డ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెంట్ సాధించే కొంత కష్టపడాల్సి వచ్చింది.

    Pushpa OTT

    తెలుగులో టికెట్ల రేట్ల తగ్గింపు కూడా ‘పుష్ప’పై భారీగానే ప్రభావం చూపింది. మొత్తానికి ఎలాగోలా బ్రేక్ ఈవెంట్ సాధించిన ‘పుష్ప’ అల్లు అర్జున్ ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచింది. దీంతో ‘పుష్ప-2’కు లైన్ క్లియర్ అయినట్లయింది. త్వరలోనే ‘పుష్ప-2’కు సంబంధించిన అప్డేట్స్ దర్శకుడు సుకుమార్ ఇచ్చే అవకాశం కన్పిస్తున్నాయి.

    మరోవైపు ‘పుష్ప’ సంబంధించిన కొన్ని డిలిటేడ్ సీన్స్ ను ‘పుష్ప’ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుండటం విశేషం. ఈ మూవీ నైజాం, హిందీ, ఓవర్సీస్ లో ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది. ముఖ్యంగా హిందీలో ఈమూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు రావడంపై చిత్ర నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    థియేటర్లలో రన్ టైమ్ చివరి చేరుకోవడంతో ఈ మూవీ ఓటీటీ బాటపట్టింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ‘పుష్ప’ మూవీ హక్కులను 22కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈక్రమంలోనే నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. నేటి సాయంత్రం 7గంటలకు అమెజాన్ ప్రైమ్ ‘పుష్ప’ స్ట్రీమింగ్ కానుంది.