https://oktelugu.com/

Pushpa Day2 Collections: రెండో రోజుకే 100 కోట్ల క్లబ్​లో చేరిపోయిన ‘పుష్ప’రాజ్​

Pushpa Day2 Collections: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన సినిమా పుష్ప.. థియేటర్లలో సందడి చేస్తోంది. బన్నీ ఈ సినిమాలో ఎప్పుడూ కనిపించని మాస్​ లుక్​లో దర్శనమిచ్చారు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్ల సుమాని సృష్టించింది. తొలి రోజు కలెక్షన్లలో 2021 బిగ్గెస్ట్ గ్రాసర్​గా రికార్డు సృష్టించగా.. రెండో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 05:58 PM IST
    Follow us on

    Pushpa Day2 Collections: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన సినిమా పుష్ప.. థియేటర్లలో సందడి చేస్తోంది. బన్నీ ఈ సినిమాలో ఎప్పుడూ కనిపించని మాస్​ లుక్​లో దర్శనమిచ్చారు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్ల సుమాని సృష్టించింది. తొలి రోజు కలెక్షన్లలో 2021 బిగ్గెస్ట్ గ్రాసర్​గా రికార్డు సృష్టించగా.. రెండో రోజు కూడా అదే జోరుతో దూసుకెళ్లిపోయాడు పుష్పరాజ్​. తొలిరోజు 71 కోట్లు వసూళ్లు చేయగా.. రెండో రోజు 45 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్లను క్రియేట్​ చేస్తున్నారు.

    ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. సునీల్​, అనసూయ, జగదీశ్​, ప్రతాప్ భండారీ, కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మించారు. ఒక్కో క్యారెక్టర్​ను సుకుమార్ తీర్చి దిద్దిన తీరు అందర్నీ ఆశ్చపరుస్తోంది.

    కరోనా సెకెండ్​ వేవ్​ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన తొలి ఇండియన్​ సినిమాగా పుష్ప నిలిచింది. రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని థియేటర్లలో హౌస్​ఫుల్​ అయ్యింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తెలుగుతో పాటు 5 ప్రధాన భాషల్లో విడులైంది ఈ సినిమా.. మిగిలిన భాషల్లోనూ అంతే జోరుతో ఓపెనింగ్స్ తెచ్చుకుంది పుష్ప.  ఈ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 116 కోట్లు రాబట్టి.. 100 కోట్ల క్లబ్​లో చేరిపోయింది.