Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie Another Record: #RRR కి కూడా దక్కని అరుదైన గౌరవం ని మరోసారి...

Pushpa Movie Another Record: #RRR కి కూడా దక్కని అరుదైన గౌరవం ని మరోసారి దక్కించుకున్న పుష్ప

Pushpa Movie Another Record: గత ఏడాది డిసెంబర్ 17 వ తారీఖున విడువులైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదట్లో కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత టాక్ పికప్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..#RRR సినిమాకి కూడా అక్కడ ఈ రేంజ్ రీచ్ రాలేదు..ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి TRP రేటింగ్స్ కూడా అదిరిపోయాయి..మా టీవీ లో టెలికాస్ట్ అయినా ఈ సినిమాకి 23 రేటింగ్స్ వచ్చాయి..ఈ స్థాయి రేటింగ్స్ #RRR సినిమాకి కూడా రాకపోవడం విశేషం..ఈ సినిమా ప్రభంజనం ఇంకా ఆగిపోలేదు..కొనసాగుతూనే ఉంది.

Pushpa Movie Another Record
allu arjun

ఇటీవల కాలం లో ఏ సినిమాకి కూడా దక్కని అరుదైన గౌరవం పుష్ప సినిమాకి దక్కింది..అదేమిటి అంటే మోస్కో లో జరుగుతున్నా ఇంటర్నేషనల్ లెవెల్ ఫిలిం ఫెస్టివల్ లో పుష్ప మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వెయ్యబోతున్నారు అట..అక్కడ ఈ సినిమాకి రషియా మరియు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్సయించబోతున్నారట..ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము లేపేసిన దర్శక ధీరుడు రాజమౌళి #RRR సినిమాకి కూడా దక్కని అరుదైన గౌరవం పుష్ప సినిమాకి దక్కడం విశేషం..ఇక అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది..పార్ట్ 1 కి ఊహించని రేంజ్ రెస్పాన్స్ రావడం తో పార్ట్ 2 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

allu arjun
allu arjun

ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించడానికి సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు..ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చెయ్యడానికి సుకుమార్ ఒక ప్రత్యేక టీం ని పెట్టుకున్నాడు..అందులో ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు కూడా ఉన్నాడు..చూడాలి మరి ఈ పుష్ప సీక్వెల్ ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టితుందో అనేది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version