https://oktelugu.com/

పుష్ప మూవీ అప్డేట్: దేవీ శ్రీ రచ్చ షురూ

https://www.youtube.com/watch?v=CV5YR8CWLNk టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు ఆగస్టు 2 సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతూ ‘పుష్ప’ టీం తాజాగా ఆ సినిమాలోని పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పుష్ప సినిమాలోని తొలి పాటను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పుష్ప సాంగ్ రిలీజ్ ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ పాట తొలి పదాలను రివీల్ చేసి ఒక్కో భాషలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 / 12:59 PM IST
    Follow us on

    https://www.youtube.com/watch?v=CV5YR8CWLNk

    టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు ఆగస్టు 2 సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతూ ‘పుష్ప’ టీం తాజాగా ఆ సినిమాలోని పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పుష్ప సినిమాలోని తొలి పాటను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

    పుష్ప సాంగ్ రిలీజ్ ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ పాట తొలి పదాలను రివీల్ చేసి ఒక్కో భాషలో ఒక్కొక్కరితో పాడేందుకు సిద్ధమైన తీరును తాజాగా వీడియోలో చూపించారు.

    దేవీ శ్రీప్రసాద్ ఈ పుష్ప ప్యాన్ ఇండియా మూవీ కోసం ‘దాక్కోదాక్కో మేక’ అనే పాటను ఐదు భాషల్లో పాడించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలలో వివిధ గాయకులు ఈ పాటను పాడారు. ఈ వీడియోను దేవీ శ్రీప్రసాద్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

    ఇప్పటికే పుష్ఫ కోసం కంపోజ్ చేసిన పాటలు, ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని అల్లు అర్జున్ కాంపౌండ్ లీక్ చేసింది. పుష్ప పాటలు కొన్నేళ్లు అలా మనల్ని వెంటాడుతుంటాయని చెప్పాడట.. దేవీ శ్రీ ప్రసాద్ టైం మళ్లీ మొదలవుతుందని చెబుతున్నారు.

    ఇప్పటికే అల్లు అర్జున్-సుకుమార్ -దేవీశ్రీ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందింది.ఇప్పుడు మరోసారి అది రిపీట్ కానుందని తెలుస్తోంది. తాజాగా ‘పుష్ప’లోని తొలి సింగిల్ బీట్ ను ఇక్కడ చూడొచ్చు.