https://oktelugu.com/

Pushpa: సాలిడ్​ ప్రమోషన్స్​కు పుష్ప సిద్ధం.. ట్విట్​తో ఆసక్తి పెంచిన టీమ్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లక్ నుంచే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 12, 2021 / 10:25 AM IST
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

    ఈ సినిమా ఫస్ట్ లక్ నుంచే సాలిడ్​ హైగ్ క్రియేట్​ చేసిన మేకర్స్​.. ఒక్కో పాట విడుదల చేస్తూ.. సినిమాపై మరిన్ని అంచానాలు పెంచేశారు. ఇటీవలే సమంత స్టెప్పులేసిన ఊ అంటావా మావ పాట ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతోంది. మరోవైపు ట్రైలర్​ కూడా విడుదల చేసి ఆకట్టుకున్నారు మేకర్స్​. ఇలా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుటూనే.. ఎలాగైనా అనుకున్న డేట్​కి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు నెలలు బాగా కష్టపడ్డారు. ఎట్టకేలకు సినిమాను అన్ని హంగులతో విడుదలకు సిద్ధం చేశారు. కాగా, ప్రస్తుతం ప్రమోషన్స్​ పనుల్లో బిజీ అయ్యారు.

    తాజాగా అల్లు అర్జున్​, రష్మిక తెలుగు, తమిళ్​లో ప్రమోషన్స్​ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ రెంజు భాషల్లో ఇంటర్వ్యూ పూర్తి చేసినట్లు ట్వీట్​ ద్వారా తెలిపారు. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు రానుంది.  మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.