Homeఎంటర్టైన్మెంట్Pushpa: 'ఏయ్​ బిడ్డా.. ఇది నా అడ్డా'.. పుష్ప కొత్త అప్​డేట్​!

Pushpa: ‘ఏయ్​ బిడ్డా.. ఇది నా అడ్డా’.. పుష్ప కొత్త అప్​డేట్​!

Pushpa: స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. వీరిద్దరి కాంబినేషన్​లో చాలా కాలం తర్వాత వస్తోన్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్లుగానే పోస్టర్​, సాంగ్స్​లు విడుద చేసి సినిమాపై మరింత హైప్​ పెంచుతున్నారు మేకర్స్​. పాన్​ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్​లో ఎప్పుడూ కనిపించని విభిన్నమైన పాత్రలో బన్నీ ఈ మూవీలో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్​ సంగీత దర్శకుడు.

కాగా, ఇటీవలే  ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి సాంగ్స్​ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతున్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి కొత్త అప్​డేట్​ వచ్చింది. సినిమాలోని నాలుగో సాంగ్​ విడుదల సంబంధించిన పోస్ట్​తో జోరుపెంచారు. ఓయ్​ బిడ్డా.. ఇది నా అడ్డా అనే పాటను నవంబరు 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​.

allu arjun

ప్రస్తుతం సినిమా షూటింగ్​ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్​. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది.  జగపతి బాబు, సునీల్, అనసూయ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular