Pushpa 2: ‘పుష్ప’ చిత్రం విడుదలై మూడేళ్లు అయ్యింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ నుండి కొత్త సినిమా ఒక్కటి కూడా రాలేదు. పుష్ప కి సీక్వెల్ గా ‘పుష్ప 2 : ది రూల్’ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ ఈమధ్య ఒక సినిమా తీయడానికి రాజమౌళి కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. రాజమౌళి అంటే ఒక్కో సినిమాని భారీ బడ్జెట్ తో తీస్తాడు కాబట్టి అంత సమయం పడుతుంది, అందులో ఒక అర్థం ఉంది..కానీ సుకుమార్ తీసే సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే. పుష్ప 2 కూడా ఒక మామూలు కమర్షియల్ సినిమానే, కానీ పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద హిట్ అయ్యింది కాబట్టి ఈ చిత్రానికి ఇంత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా స్టోరీ ని రాయడానికి సుకుమార్ ఏడాదికి పైగా సమయం పట్టిందట. ప్రముఖ దర్శకుడు బుచ్చి బాబు కూడా ఈ సినిమాకి కథ రాయడం లో సుకుమార్ కి సహకరించాడు. అలా ఎట్టకేలకు స్టోరీ, స్క్రిప్ట్ ని ఫైనల్ చేసి షూటింగ్ ని ప్రారంభించారు.
షూటింగ్ మొదలై దాదాపుగా రెండు నెలలు పూర్తి అయ్యింది. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మొత్తం ఫైనల్ ఎడిటింగ్, రీ రికార్డింగ్ తో సహా రెడీ అయిపోయిందట. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫహాద్ ఫాజిల్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇంకో 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. డిసెంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యేందుకు అన్ని విధాలుగా ఈ సినిమా సిద్ధం అవుతుంది. అయితే ఈ చిత్రం గురించి కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న రూమర్ అల్లు అర్జున్ అభిమానులను కాస్త చిరాకుకి గురి చేస్తుంది. ఇంతకు ఆ వార్త ఏమిటంటే ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం విడుదలను ఒక రోజు ముందుకు, అనగా డిసెంబర్ 5 వ తేదికి ప్రీ పోన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 5వ తేదీ అంటే గురువారం రోజు విడుదల అవ్వబోతుంది అన్నమాట.
ఈమధ్య కాలం లో ప్రతిష్టాత్మక చిత్రాలకు లాంగ్ వీకెండ్ బాగా కలిసి వస్తుంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఆ నాలుగు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు అవుతున్నాయి. పుష్ప 2 ని కూడా అందుకే లాంగ్ వీకెండ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. సినిమా మీద ఎలాగో భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కచ్చితంగా అదిరిపోతుంది. ఫుల్ రన్ కూడా బాగా ఉండే అవకాశాలు ఉండడం తో బయ్యర్స్ మొదటి వారం లోనే సగానికి పైగా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే మాటికొస్తే ఇలా డేట్స్ మారుస్తూ ఉండడం వల్ల ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోతుందని అల్లు అర్జున్ అభిమానులు మేకర్స్ పై మండిపడుతున్నారు.