Puri Jagannadh Slum Dog buyers issue: స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే మన గుర్తుకొచ్చే మొదటి పేరు పూరి జగన్నాథ్(Puri Jagannath). తెలుగు కమర్షియల్ సినిమా రూపు రేఖలను మార్చేసిన లెజెండ్ ఆయన. కేవలం పూరి జగన్నాథ్ పేరు ని చూసి , కళ్ళు మూసుకొని టికెట్స్ కొనుగోలు చేసి వెళ్లే ఆడియన్స్ లక్షల సంఖ్యలో ఉంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు , కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ పరిస్థితి వర్ణనాతీతం. వరుస ఫెయిల్యూర్స్ తో పూర్తిగా ఆడియన్స్ లో ఉన్నటువంటి గుడ్ విల్ ని పోగొట్టుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు , కానీ ఆ తర్వాత విడుదలైన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలు అత్యంత దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా , నిర్మాతగా కూడా వ్యవహరించాడు పూరి జగన్నాథ్.
దీంతో ఆయన ఆర్థికంగా కూడా బాగా కృంగిపోయాడు. ఇప్పుడు తన సినిమాలకు ఫైనాన్స్ చేసే వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఎలాగో అలా , ఉన్నది మొత్తం ఊడ్చేసి , తమిళ హీరో విజయ్ సేతుపతి ని పెట్టి ‘స్లమ్ డాగ్’ అనే చిత్రాన్ని తీసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విజయ్ సేతుపతి పుట్టినరోజున విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్టన్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఒక్క బయ్యర్ కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ముందు రెండు సినిమాల తాలూకా సెటిల్మెంట్స్ పూరి ఇంకా చెయ్యలేదు కాబట్టి. ఈ చిత్రాన్ని ఉచితంగానే ఇస్తాను , విడుదల చెయ్యండి , లాభాలు వచ్చినప్పుడు పంచుకుందామని పూరి జగన్నాథ్ స్వయంగా బయ్యర్స్ ని రిక్వెస్ట్ చేశాడట.
అయినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదని సమాచారం. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమా ఆడుతుంది అనే నమ్మకం వారిలో లేదు కాబట్టి. ఉచితంగా విడుదల చేయడమంటే, థియేటర్స్ కి అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకోవాలి, ఆ డబ్బులంతా మాకు వృధా, అంత రిస్క్ చేయలేము అనేది బయ్యర్స్ వాదన. అలా ఒకప్పుడు సూపర్ స్టార్స్ తో సమానమైన ఇమేజ్ ఉన్న పూరి జగన్నాథ్ బ్రాండ్ విలువ, ఇప్పుడు ఒక్క సినిమాని విడుదల చేసుకోవడానికి కూడా ఉపయోగపడడం లేదు , అంతలా డౌన్ అయ్యాడు. కనీసం నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోవడం లేదంటే పూరి జగన్నాథ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.