Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh: అలాంటి వాళ్లను మీరు ఓడించలేరు.. పూరి చెప్పిన సీక్రెట్స్...

Puri Jagannadh: అలాంటి వాళ్లను మీరు ఓడించలేరు.. పూరి చెప్పిన సీక్రెట్స్…

Puri Jagannadh: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించెవి. ఎప్పుడైతే ఆయన వరుస సినిమాలను చేయడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయి. అయితే ప్రేక్షకులు తనను దూరం పెట్టిన కూడా తను జనానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన పూరి మ్యూజింగ్స్ అనే ఛానెల్ ద్వారా జనాలను మోటివేట్ నుంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ఆటిట్యూడ్ గురించి చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు మన ఆటిట్యూడ్ పాజిటివ్ గానే ఉండాలని దానిని నెగెటివ్ గా మార్చుకుంటే అది చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుందని చెప్పాడు. అలాగే నదిలో కొట్టుకుపోయే ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు చచ్చిపోతే మరొకడు ఏదో ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ బతుకుతూ ఉంటాడు. పాజిటివ్ అటిట్యూడ్ ఉన్నోడు అయితే కనీసం నేను బతికున్నాను కదా అనే ఒక ఆనందంతో ఉంటాడు.

అదే నెగెటివ్ ఆటిట్యూడ్ తో ఉన్నవాడైతే నాకే ఎందుకిలా జరిగింది. ఇప్పుడు నేను ఎలా బతకాలి అని ఒక నెగెటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తాడు అంటూ ఆయన దానిలో పేర్కొన్నారు. ఇక ఎప్పుడు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటేనే మనం ఏం చేయాలి అనేది మనకు క్లారిటి ఉంటుందని చెప్పాడు.

నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి దీవెనలు కూడా దరిద్రం గా అనిపిస్తాయని, కన్షియస్ మైండ్ లో ఉన్నవాడికి కష్టాలు కూడా అవకాశాల్లా అనిపిస్తాయని ఆయన క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు…అలాగే ప్రపంచంలో ఏదీ నీకు వ్యతిరేకంగా జరగదు. జరుగుతున్న ప్రపంచంలో నువ్వున్నావ్ అంతే… ప్రతి దానికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ వెళ్తే నీకే నష్టం కలుగుతుంది. ఎప్పుడు ఏడుస్తూ బ్రతకాలి అనుకునే వారికి చుట్టూ వేరే కారణాలు గుర్తొస్తుంటాయి.

కానీ ఏది జరిగినా అది మన చేతుల్లో లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అంతే అనుకునే వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రైట్ ఆటిట్యూడ్ తో ఉండే వాళ్ళు జీవితంలో ఏదో ఒకసారి సక్సెస్ ని సాధిస్తారు… ఎవరికి భయపడకుండా మీకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళండి రైట్ ఆటిట్యూడ్ తో వెళ్ళిన వారికి ఎప్పటికీ సక్సెస్ లు వస్తూనే ఉంటాయి అంటూ ఆయన పాజిటివ్ ఆటిట్యూడ్ గురించి మోటివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version