Puneeth Rajkumar Biography: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను కలిచివేసింది. తోటి సినీ తారల మనసులను బాధతో కప్పేసింది. పునీత్ పుడుతూనే స్టార్. ఎదుగుతున్న క్రమంలో తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గుర్తింపు తెచ్చుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ – రాజ్ కుమార్ మంచి స్నేహితులు. సీనియర్ ఎన్టీఆర్ కి ఓ అలవాటు ఉంది. మనిషిని చూసి.. లేదా పరిశీలించి అతనిలో ప్రతిభను ఇట్టే గుర్తించగలరు.

అలా ఓ సందర్భంలో శివ రాజ్ కుమార్ పెళ్లికి అనుకుంటా.. రాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు ఎన్టీఆర్. అక్కడ పునీత్ రాజ్ కుమార్ ను చూస్తూ ఎన్టీఆర్ చాలా సంబరపడ్డారట. ‘వీరు గొప్ప హీరో అవుతారు బ్రదర్’ అని ఎన్టీఆర్, తన తండ్రి రాజ్ కుమార్ తో చెప్పారని ఓ ఇంటర్వ్యూలో పునీత్ రాజ్ కుమారే చెప్పుకున్నారు. ఎన్టీఆర్ చెప్పినట్టుగానే కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎదిగాడు పునీత్ రాజ్ కుమార్.
అయితే కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ చాలా కష్టపడ్డాడు. అతని జీవితం క్రమశిక్షణతో సాగింది. పునీత్ జీవిత విశేషాలను చూద్దాం. కన్నడిగులు రాజ్ కుమార్ ను ప్రత్యక్ష దైవంలా ఆరాధించే వారు. అలాంటి ఆయనకు మూడో కుమారుడిగా పునీత్ రాజ్ కుమార్ 19975 మార్చ్ 17న జన్మించాడు. చిన్నతనం నుంచే పునీత్ లో మంచి నటుడు ఉన్నాడు.
ఒకపక్క రాజ్ కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ కన్నడ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నా.. రాజా కుమార్ మాత్రం తన చిన్న కొడుకు ఇంకా గొప్ప స్టార్ అవుతాడని అందరితో చెబుతూ ఉండేవారట. అందుకు తగ్గట్టుగానే పునీత్ రాజ్‌కుమార్ కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా కొన్నాళ్ళు పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగారు.
ఇక పునీత్ రాజ్ కుమార్ మొదటి చిత్రం దర్శకుడు మన తెలుగువాడే. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 2002 లో తెరకెక్కిన “అప్పు” సినిమాతో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. అలా మొదటి సినిమాతోనే పునీత్ సూపర్ స్టార్ అయ్యాడు.
అన్నిటికి మించి కన్నడ ఇండస్ట్రీలో డ్యాన్స్ లను, ఫైట్స్ లను ఓ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. కన్నడలో ఏ హీరోకి లేని ఘనత కూడా పునీత్ రాజ్ కుమార్ కి ఉంది. ఈ జనరేషన్ లోనే పునీత పేరిట నాలుగు కన్నడ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ ఈ నాలుగు చిత్రాలు కన్నడలో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి.
ఇక పునీత్ కి తెలుగు నటులు అన్నా, తెలుగు టెక్నీషియన్స్ అన్నా ఎంతో గౌరవం. ముఖ్యంగా జూనియర్ యన్టీఆర్ ను తన సొంత తమ్ముడిలా పునీత్ భావిస్తాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేత ఓ పాట పాడించుకున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో యాంకర్ రవి… ఎలిమినేట్ అయ్యేది అతడేనా
పైగా పునీత్ కెరీర్ లో మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఎక్కువగా మాస్ సినిమాలే చేసినా.. అవార్డ్స్ పునీత్ రాజ్ కుమార్ ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక 1985లో ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెల్చుకున్న ఘనత కూడా ఒక్క పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది.
ఆయనకు ఫ్యామిలీ అంటే ప్రాణం.. పునీత్ భార్య పేరు అశ్విని రేవంత్. పునీత్ కి వందిత రాజ్ కుమార్, ద్రితి రాజ్ కుమార్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఏది ఏమైనా 46 ఏళ్ళ వయసులోనే పునీత్ చనిపోవడం బాధాకరమైన విషయం. పునీత్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం.
Also Read: Anasuya Bharadwaj: మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన అనసూయ?