
Punch Prasad : పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగనుంది. ఈ క్రమంలో భార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన కిడ్నీలు పాడయ్యాయి. రెగ్యులర్ గా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఏదో ఒక సమస్య ఆయన్ని వెంటాడుతుంది. ఒక దశలో నడవలేని స్థితికి చేరాడు. తోటి కమెడియన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆరోగ్యం బాగోక పోయినా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి షోలలో అవకాశం ఇచ్చారు.
ఆదాయం లేకపోతే పంచ్ ప్రసాద్ కి చికిత్సకు కూడా డబ్బులు ఉండవు. గతంలో నాగబాబు, రోజాలతో పాటు ఇతర కమెడియన్స్ ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ఖరీదైన చికిత్స కావడంతో లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇటీవల పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ట్రాన్స్ప్లాంట్ చేయడం అనివార్యమని డాక్టర్స్ సూచించారు. త్వరలో పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఒక కిడ్నీ దొరగ్గా వైద్యులు ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.

పంచ్ ప్రసాద్ కి కిడ్నీ భార్య ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు అవసరమైన పరీక్షలు కూడా నిర్వహించారట. ఆమె కిడ్నీ మ్యాచ్ అవుతుందని వైద్యులు వెల్లడించారట. ఇప్పుడు వేరొకరి కిడ్నీ లభించడంతో వద్దని పంచ్ ప్రసాద్ భార్యకు చెప్పారట. అలాగే పంచ్ ప్రసాదుది చిన్న వయసు. భవిష్యత్ లో మరలా సమస్య వస్తే అప్పుడు మీరు కిడ్నీ ఇవ్వవచ్చు. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారట. ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ భార్య స్వయంగా వెల్లడించారు.
ఆ మధ్య కిరాక్ ఆర్పీ పంచ్ ప్రసాద్ ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. త్వరలో మణికొండలో ప్రారంభించనున్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ నుండి వచ్చే ఆదాయం పంచ్ ప్రసాద్ వైద్యానికి ఖర్చు చేస్తానన్నారు. పది లక్షలు ఖర్చైనా అతన్ని కాపాడతానని చెప్పారు. మణికొండలో చేపల పులుసు బ్రాంచ్ అయితే ఓపెన్ చేశాడు. మరి హామీ ఇచ్చిన ప్రకారం సహాయం చేస్తున్నాడో లేదో తెలియదు.