Shyam Singha Roy Deleted Scene: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మంచి విజయం సాధించింది. శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. తాజాగా ప్రేక్షకుల కోసం చిత్రబృందం డిలీటెడ్ సీన్‌ను విడుదల చేసింది. దేవదాసీల మధ్య కూర్చున్న శ్యామ్ సింగరాయ్.. వేశ్యలతో వారి వృత్తికి సంబంధించి నాని తను రాసిన కవిత్వాన్ని వారికి వినిపిస్తాడు.

Also Read: ఫుల్ జోష్ లో నాని.. ఇది ఎవ్వరూ ఊహించలేదు !
ఇంత తెలిసిన వాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఓ వేశ్య అడుగుతుంది. దానికి నాని ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు అని బదులిస్తాడు. ఈ సీన్ చాలా బాగుంది. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ నాని కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మరోపక్క విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ముందే క్యాష్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు రూ.32 కోట్లు రాబట్టింది. అంటే పూర్తి లాభాల్లోకి ‘శ్యామ్ సింగ రాయ్’ వెళ్ళిపోయాడు.
Also Read: బాక్సాఫీస్ : ‘శ్యామ్ సింగరాయ్’ ఫుల్ కలెక్షన్స్ డిటైల్స్ !
[…] […]