Project K: ప్రాజెక్ట్ కే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అరుదైన గౌరవం అందుకుంది. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ లో పాల్గొనే మొదటి ఇండియన్ మూవీ కానుంది. జులై 20న జరిగే ఈ ఇంటెర్నేషనల్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టీమ్ పాల్గొననున్నారు. వైజయంతి మూవీస్ ఇండియన్ కల్చర్ గురించి ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రేక్షకులను తమ సంభాషణలతో అలరించనున్నారు.
అమెరికాలోని శాన్ డియాగోలో జరిగే కామిక్ కామ్ ఈవెంట్ కి గతంలో ఏ ఇండియన్ చిత్రానికి ఆహ్వానం లేదు. మొదటి చిత్రం మూవీ ప్రాజెక్ట్ కే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రాజెక్ట్ కే టీమ్ ప్రభాస్ ని సూపర్ హీరోగా చూపిస్తూ స్పెషల్ క్యారికేచర్ విడుదల చేశారు. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టీమ్ నుండి ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని సమాచారం.
ఈ వేదికపై ప్రాజెక్ట్ కే టైటిల్, ట్రైలర్, రిలీజ్ డేట్ పై ప్రకటనలు చేయనున్నారని తెలుస్తుంది. విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన ప్రాజెక్ట్ కే పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ కే మూవీ మీద ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయని అర్థం అవుతుంది. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇది టైం ట్రావెలర్ మూవీ అనే ఒక వాదన ఉంది. అలాగే ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కృష్ణ అని అర్థం అట. ప్రభాస్ మోడ్రెన్ కృష్ణుడుగా కనిపించే అవకాశం కలదంటున్నారు.
అలాగే ప్రాజెక్ట్ కే పలు భాగాలుగా విడుదల కానుందట. ఇటీవల కమల్ హాసన్ నటిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆయన పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ ప్రతినాయకుడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్ట్ కే మూవీలో దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తుంది.
𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓!
San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 6, 2023