Homeఎంటర్టైన్మెంట్Virata Parvam Producers: సాయి పల్లవి పై విరుచుపడిన విరాటపర్వం నిర్మాతలు

Virata Parvam Producers: సాయి పల్లవి పై విరుచుపడిన విరాటపర్వం నిర్మాతలు

Virata Parvam Producers: దగ్గుపాటి రానా మరియు సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు ఉడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన విరాట పర్వం చిత్రం ఈ నెల 17 వ తారీఖున విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ వసూళ్లు మాత్రం కనీస స్థాయిలో కూడా రావడం లేదు..ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కావడం తో కచితంగా ఓపెనింగ్ అదిరిపోతుంది అని అనుకున్నారు..యూత్ లో ఈమెకి ఒక రేంజ్ క్రేజ్ ఉండడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపుగా 11 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ ఇప్పటి వరుకు ఈ సినిమాకి కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చిందని తెలుస్తుంది..అంటే సుమారు 7 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లింది అన్నమాట..సినిమాకి మొదటి నుండి కావాల్సిన హైప్ లేకపోవడం వల్లే జనాలు ఈ సినిమా పై ఆసక్తి చూపించలేదని కొంతమంది సినీ విమర్శకుల అభిప్రాయం..గత ఏడాది ఏప్రిల్ 17 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణం గా విడుదల ఆగిపోయింది..లాక్ డౌన్ సమయం లో OTT ఆఫర్లు చాలానే వచ్చాయి..కానీ సురేష్ బాబు ఈ సినిమాని లేట్ అయినా కూడా థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలనుకున్నాడు.

Virata Parvam Producers
Rana, Sai pallavi

Also Read: Puri Jagannadh- Charmi: హీరోయిన్ ఛార్మి వల్ల పూరి జగనాథ్ ఇంట్లో గొడవలు

అయితే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్లు రాకపొయ్యేసరికి నిర్మాత సురేష్ బాబు సాయి పల్లవి పై కోపం గా ఉన్నట్టు తెలుస్తుంది..ఎందుకంటే ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి కాశ్మీర్ పండిట్స్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం గా మారాయి..దీని మీద సోషల్ మీడియా లో సాయి పల్లవి నెటిజెన్స్ నుండి విపరీతమైన ట్రోల్ల్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది..నిన్న మొన్నటి వరుకు ఆమె టాలెంట్ ని ఎంతగానో మెచ్చుకున్న వారు కూడా సాయి పల్లవి చేసిన కామెంట్స్ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు..ఆమె చేసిన ఈ కామెంట్స్ విరాటపర్వం సినిమా పై తీవ్రంగా పడిందని ఆ చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట..సాయి పల్లవి చేసిన కామెంట్స్ వాళ్ళ పెద్ద ఎత్తున నెటిజెన్లు విరాట పర్వం సినిమాని బ్యాన్ చెయ్యాలని నిరసన చేసారు..ఇలాంటి జానర్ కి సంబంధించిన సినిమాలు పైన సోషల్ మీడియా ప్రభావం చాలా గట్టిగా పడుతుంది..విరాటపర్వం సినిమాకి కూడా అదే జరిగిందని సురేష్ బాబు సాయి పల్లవి పై తీవ్రమైన కోపం లో ఉన్నట్టు తెలుస్తుంది..ఆయన సాయి పల్లవి కి అంటించిన చురకలు వల్లే మళ్ళీ ఆమె తాను మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్తూ వీడియో పోస్ట్ చేసింది అని తెలుస్తోంది.

Virata Parvam Producers
Sai Pallavi

Also Read: Puri-Lavanya Love Marriage: పూరి-లావణ్యల ప్రేమ వివాహం… చేతిలో చిల్లి గవ్వ లేదు తాళిబొట్టు కొనిచ్చిన లేడీ యాంకర్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version