https://oktelugu.com/

Anil Ravipudi : ఆ డైరెక్టర్ కోసం సూట్ కేసుల నిండా డబ్బులతో క్యూ కడుతున్న నిర్మాతలు.. అంత టాలెంటెడా ?

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సంక్రాంతి వస్తున్నాం వంటి సూపర్ హిట్ ఇచ్చి ఫుల్ ఫాంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకే భాషలో విడుదల చేసి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన మూవీగా సంక్రాంతికి వస్తున్నాం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

Written By: , Updated On : February 16, 2025 / 02:00 PM IST
Anil Ravipudi

Anil Ravipudi

Follow us on

Anil Ravipudi : యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సంక్రాంతి వస్తున్నాం వంటి సూపర్ హిట్ ఇచ్చి ఫుల్ ఫాంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకే భాషలో విడుదల చేసి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన మూవీగా సంక్రాంతికి వస్తున్నాం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. రీజనల్ ఫిల్మ్స్ కేటగిరీలో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పైగా టాలీవుడ్ సీనియర్లు ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేని రేర్ ఫీట్‌ను వెంకటేష్ కొట్టేశాడు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి 200 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు వెంకటేష్ ఇలా మూడు వందల కోట్ల టార్గెట్ సెట్ చేశాడు.

ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం క‌మ‌ర్శియ‌ల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. నిర్మాత‌ల‌కు డ‌బ్బులొచ్చే సినిమా తీయాలంటే అది అనిల్ రావిపూడికి మాత్రమే సాధ్యం అవుతుందని మ‌రోసారి సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో ప్రూవ్ చేశాడు. 300 కోట్లకు పైగా కలెక్షన్లు కేవలం రీజ‌న‌ల్ మార్కెట్ లోనే రాబ‌ట్టింది సంక్రాంతికి వస్తున్నాం. దీంతో ఈ సినిమా నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, ఎగ్జిబిట‌ర్, బ‌య్యార్లు అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.

సినిమాకు భారీ లాభాలు రావ‌డంతో త‌మ క‌ష్టాల‌న్నీ తిర‌పోయాయంటూ చెప్పిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. సినిమా డిస్టిబ్యూటర్లు అంద‌రినీ ఇలా తెర‌పైకి తేవ‌డం అన్నది చాలా కాలం త‌ర్వాత జ‌రిగింది. పాత రోజుల్లో ఇలాంటి సరిగ్గా ఇలాంటి వాతావరణమే కనిపించేది. మ‌ళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజ‌యంతో అదే వాతావరణాన్ని దిల్ రాజు చూపించారు. దీనంత‌టికి కార‌ణం అనిల్ రావిపూడినే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి ఇప్పుడు అనిల్ రావిపూడి క్రేజ్ ఎలా ఉందో? తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అనిల్ తో సినిమా చేయాల‌ని నిర్మాత‌లంతా పోటీ ప‌డుతున్నారట‌. అడ్వాన్సులు ఇవ్వడానికి అనిల్ ఇంటి ముందు క్యూ క‌డుతున్నారు. ఓ పేరున్న నిర్మాత అయితే ఏకంగా రూ.50 కోట్లు తీసుకుని వచ్చాడట. మా బ్యాన‌ర్లో ఎప్పుడైనా సినిమా తీయండి…ప్రస్తుతానికి ఈ అమౌంట్ ఉంచండ‌ని ఇవ్వబోయేందుకు ట్రై చేశాడట. కానీ అనిల్ రావిపూడి రిజెక్ట్ చేశాడట. భవిష్యతులో సినిమా తప్పకుండా చేసి పెడతాను కానీ ప్రస్తుతానికి డబ్బులు మాత్రం తీసుకోనని తిప్పి పంపాడట. ఇలా ఉంది ప్రస్తుతం ఇండస్ట్రీలో అనిల్ క్రేజ్. ఆయనకు తక్కువ బ‌డ్జెట్ లో సినిమా తీయ‌డ‌మే కాదు… దానిని ఎలా జ‌నాల్లోకి ఎలా తీసుకెళ్లాడో కూడా తెలుసు. తన ప్రతీ సినిమాకు రిలీజ్ సమయంలో తన స్ట్రాటజీతో నిర్మాతలకు భారీగా పబ్లిసిటీ ఖర్చులు తగ్గిస్తూ సినిమాను సక్సెస్ బాటలో నడిపిస్తున్నాడు. అందుకే నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారిపోయాడు.