Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya: పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన వైష్ణవి చైతన్యకు దర్శకుడు సాయి రాజేష్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. బేబీ చిత్రంలో వైష్ణవి చైతన్య లీడ్ రోల్ చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇతర ప్రధాన పాత్రలు చేశారు. బేబీ చిత్రంలో వైష్ణవి పాత్ర ఒకింత హద్దులు దాటి, శృంగార సన్నివేశాల్లో నటించింది. ఈ పాత్ర చేసినందుకు దర్శకుడు సాయి రాజేష్ ఆమెకు మరో రెండు చిత్రాల్లో కూడా హీరోయిన్ గా ఆఫర్స్ ఇచ్చాడు.
బేబీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బేబీ చిత్రానికి ఎస్ కే ఎన్ నిర్మాతగా ఉన్నారు. ఆయన ప్రయత్నం ఫలించింది, భారీ లాభాలు బేబీ మూవీతో అందుకున్నారు. వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వైష్ణవి చైతన్య భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీ టాక్.
బేబీ విడుదల అనంతరం వైష్ణవి చైతన్యపై దర్శకుడు సాయి రాజేష్, ఎస్ కే ఎన్ ప్రశంసలు కురిపించారు. ఆమె తెగించి ఈ పాత్ర చేశారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిందని వెల్లడించారు. కాగా నిర్మాత ఎస్ కే ఎన్ లేటెస్ట్ కామెంట్స్ మాత్రం వైష్ణవి చైతన్యతో ఆయనకు చెడింది అనే.. అనుమానం రాజేసేలా ఉన్నాయి. ఎస్ కే ఎన్ ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కంటే ఇతర భాషలకు చెందిన తెలుగు రాని అమ్మాయిలకు అవకాశాలు ఇస్తారు. దానికి కారణం ఉంది. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయ్యింది, అన్నారు. ఈ కామెంట్స్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి ఎస్ కే ఎన్ అన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. పరోక్షంగా వైష్ణవి చైతన్యను టార్గెట్ చేయడంతో.. వారి మధ్య విభేదాలు తలెత్తాయనే చర్చ మొదలైంది.
బేబీ అనంతరం వైష్ణవి లవ్ మీ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. అది అంతగా ఆడలేదు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య రెండు చిత్రాలు చేస్తుంది. వైష్ణవి చైతన్య చిత్రాల కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Web Title: Producer shocking comments on baby movie heroine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com