Homeఎంటర్టైన్మెంట్Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. పలువురి నివాళి

Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. పలువురి నివాళి

Delhi Ganesh: సినీ పరిశ్రమలో ఈ మద్య కాలంలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. చాలా మంది సెలబ్రెటీలు ఎక్కువగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. ఈ మధ్యనే ఆదిపురుష్‌ నటి ఆశావర్మ, నటుడు నిర్మల్‌ బెన్నీ, తమిళ యూట్యూబర్, కమెడియన్‌ బిజిలి రమేశ్, బాలీవుడ్‌ నటుడు వికాస్‌ సేథి కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

ఈసారి తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ప్రమున నిర్మాత ఢిల్లీ గణేశ్‌ సోమవారం(సెప్టెంబర్‌ 9) ఉదయం హాస్పిటల్‌లో కన్నుమూశారు. కోలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు ఆయన ప్రొడ్యూసర్‌ గా ఉన్నారు. యాక్సెస్‌ ఫిలిమ్‌ బ్యానర్‌పై తెరకెక్కించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్‌ అయి మంచి విజయం అందుకున్నాయి. ఢిల్లీ గణేశ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మార్క్సిస్ట్‌ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ఓ వైపు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు నిర్మించారు. తమిళంలో ఆయన చాలా వరకు హర్రర్, కామెడీ నేపథ్యంలో ఉన్న సినిమాలే నిర్మించారు. సూర్య హీరోగా రాక్షసుడు, ఆది పినిశెట్టితో తీసిన ‘మరకతమణి’, మిరల్, కాల్వన్, కుట్రమ్‌ కుట్రమే వంటి హర్రర్‌ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించాయి.

అర్ధరాత్రి దాటిన తర్వాత..
అతని కుటుంబానికి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీ బాబు తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించాడు. అతని అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్‌ 9 తరువాత జరుగుతాయి. డిల్లీ బాబుకు 50 ఏళ్లు, అతని ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమకు భారీ షాక్‌ ఇచ్చింది. అస్వస్థతకు గురై ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ బాబు భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నైలోని పెరుంగళత్తూరు స్వగృహానికి తీసుకురానున్నారు. సెప్టెంబర్‌ 9, సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

హార్రర్‌ సినిమాల నిర్మాతగా గుర్తింపు..
2015లో ఉరుమీన్‌తో నిర్మాతగా అరంగేట్రం చేశాడు ఢిల్లీ బాబు. కొన్నేళ్లుగా, అతను మరగధ నానయం, ఇరవుక్కు ఆయిరం కంగల్, రాత్ససన్, ఓ మై కడవులే, బ్యాచిలర్, మిరల్‌ మరియు కాల్వన్‌ వంటి చిత్రాలను నిర్మించాడు. మరికొన్ని తమిళ ప్రాజెక్ట్‌లు కూడా ౖఫైనల్‌ దశలో ఉన్నాయి. కోలీవుడ్‌లో హర్రర్‌ మూవీస్‌ నిర్మాతగా ఢిల్లీ బాబుకి మంచి పేరు ఉంది. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చరర్‌ నిర్మాత ఎస్‌ఆర్‌. ప్రభు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ బాబు లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా.. ఎంతో మంది యువ కళాకారులకు అవకాశం ఇచ్చి సపోర్ట్‌ చేశారని పేరొకన్నారు. ఆయన మృతి ఇండస్ట్రీకి, రాజకీయ పరంగా పెద్ద నష్టం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మరగధ నానయం ఫేమ్‌ దర్శకుడు ఏఆర్కే శరవణ్‌ ఢిల్లీ బాబు కోసం ఎక్సలో నోట్‌ను పోస్ట్‌ చేశారు. ఢిల్లీ బాబు సార్‌ (గుండెపోటు ఎమోజి). మరగధ నానయం సినిమా ద్వారా నాకు ప్రాణం పోశారు. తమిళ సినిమా ఆయనలాంటి మంచి మనిషిని, మంచి నిర్మాతను మరియు మంచి సాధకుడిని కోల్పోయింది. నా హృదయం నిరాకరిస్తోంది అని పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular