https://oktelugu.com/

కోరిక తీర్చుకోవడమే ప్రియాంక టార్గెట్ !

గ్లోబల్ బ్యూటీగా ప్రియాంక చోప్రాకు ఇప్పుడు అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది గానీ, ఆమె కెరీర్ కన్నీళ్లతో అవమానాలతోనే మొదలైంది. 16 ఏళ్ల వయసులోనే ప్రియాంక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు ఆమెను చూసి హేళనలు చేసేవారు. నల్లగా ఉంది, డస్కీ బ్యూటీ అంటూ ఆమె మనసును చాల సార్లు గాయపర్చారు. ఆ సమయంలోనే అసలు ఈ దేశంలో తాను ఉండకూడదని ప్రియాంక నిర్ణయించుకుందట. బహుశా అందుకేనేమో విదేశీయుడిని పెళ్ళి చేసుకుని ఇండియా వదిలి వెళ్ళిపోయింది. […]

Written By:
  • admin
  • , Updated On : June 27, 2021 / 12:00 PM IST
    Follow us on

    గ్లోబల్ బ్యూటీగా ప్రియాంక చోప్రాకు ఇప్పుడు అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది గానీ, ఆమె కెరీర్ కన్నీళ్లతో అవమానాలతోనే మొదలైంది. 16 ఏళ్ల వయసులోనే ప్రియాంక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు ఆమెను చూసి హేళనలు చేసేవారు. నల్లగా ఉంది, డస్కీ బ్యూటీ అంటూ ఆమె మనసును చాల సార్లు గాయపర్చారు.

    ఆ సమయంలోనే అసలు ఈ దేశంలో తాను ఉండకూడదని ప్రియాంక నిర్ణయించుకుందట. బహుశా అందుకేనేమో విదేశీయుడిని పెళ్ళి చేసుకుని ఇండియా వదిలి వెళ్ళిపోయింది. ఇక తన బుక్ లో తన బాలీవుడ్ ఎంట్రీ, అక్కడ తన పరిస్థితి ఎలా ఉండేది లాంటి అంశాలు గురించి కూడా చెప్పుకొచ్చారు. హిందీ సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రియాంక చాల భయపడింది.

    కేవలం కష్టపడితే పేరు వస్తుందని అనుకోవద్దంటూ ఆమెను కొంతమంది కోరిక తీర్చమంటూ ఇన్ డైరెక్ట్ గా ఒత్తిడి తెచ్చేవారట. ప్రియాంక మొదట్లో ఇలాంటి విషయాల్లో చాల సార్లు బాధ పడిందట. కానీ సినిమా సిస్టమ్ కు తగ్గట్టు పనిచేసుకుంటూ ముందుకు పోతూనే ఇక్కడ స్థానం ఉంటుందని ప్రియాంక భావించింది. చాల బోల్డ్ గా ఉండటం అలవాటు చేసుకుంది.

    ఆమెకు తెలియకుండానే పోటీ ప్రపంచం లోతుల్లోకి వెళ్ళిపోయింది. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా అనుకోకుండానే పాల్గొని అదరగొట్టింది. కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో ఆమెకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనే కోరిక పుట్టిందట. ఈ కోరిక పుట్టినప్పుడు ప్రియాంక వయసు 35 ఏళ్లు. అప్పుడే వచ్చాడు 20 ఏళ్ల నిక్. కానీ నిక్ మామూలోడు కాదు. ప్రియాంక మనసును దోచుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రియాంక టార్గెట్ పిల్లలను కనాలనే తన కోరికను తీర్చుకోవడమేనట.