Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈ రోజు ప్రియాంక ప్రియుడు శివ కుమార్ హౌస్ లో అడుగుపెట్టాడు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రియుడుని చూసిన ప్రియాంక అతడిపై ప్రేమను కురిపించేసింది. శివ ఆమెకు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ప్రియాంక చేతిని ముద్దాడాడు. వీరి రొమాన్స్ ఒకింత హద్దులు దాటేసింది. వీరి తెగింపుకు కంటెస్టెంట్ అర్జున్… రేయ్ ఏమైనా అడ్డుగా పెట్టాలా అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఎలా ఉన్నావ్ అని ప్రియాంక అడిగింది. దానికి శివ ఇలా ఉన్నాను .. నువ్వు ఎలా ఉన్నా అని ప్రియాంకను అడిగాడు.
చాలా మిస్ అవుతున్న అని చెప్పింది. నేను కూడా నిన్ను మిస్ అవుతున్న అని శివ్ అన్నాడు. ఇక తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ప్రియాంక అడిగింది. నువ్వు బయటకు రాగానే చేసేసుకుందాం అని శివ్ చెప్పాడు. లేదు ఇప్పుడే చేసుకుందాం ఇక్కడే అంటూ ప్రియాంక సిగ్గు పడింది. ఇక టైమ్ దగ్గరికి వచ్చింది అంటూ శోభా వచ్చి వాళ్ళతో చెప్పింది. బిగ్ బాస్ ఈ రోజు శివ్ ఇక్కడే ఉండొచ్చా అంటూ జోక్ చేసింది శోభా.
ఇక సమయం అయిపోయింది అని బిగ్ బాస్ చెప్పారు. ప్రియాంక బుగ్గలపై ముద్దులతో ముంచెత్తాడు. ఇక అందరికీ బై బై చెప్పి మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.కాగా వీళ్ళు మౌనరాగం సీరియల్ కలిసి నటించారు. అప్పటినుంచే వీళ్లు ప్రేమలో ఉన్నారు. కానీ పెళ్లి గురించి మాత్రం ఎక్కడా రివీల్ చెయ్యలేదు. ఏ షోలో అడిగిన విషయం చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవాళ్లు.
అలాంటిది బిగ్ బాస్ షో ద్వారా పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. దీంతో వీళ్ళ ఫాలోవర్స్ ఫుల్ కుష్ అయ్యారు. ఆడియన్స్ కూడా వీళ్ళ పెళ్లి పై ఒక క్లారిటీ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ పుణ్యమా ప్రియాంక ,శివ జంట వాళ్ళ రిలేషన్ షిప్ గురించి పెళ్లి గురించి నిజాలు బయట పెట్టారు.
https://twitter.com/StarMaa/status/1722177948630004163