Priyanka Jawalkar: ఐటమ్ సాంగ్.. సమర్థించుకోవడానికి హీరోయిన్ పాట్లు !

Priyanka Jawalkar: హీరోయిన్ అవ్వాలి అంటే..అందం ఒక్కటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి అద్భుతమైన గ్లామర్ ఉన్నా.. కొంతమంది మాత్రం హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించలేకపోతుంటారు. వాళ్లకు హీరోయిన్ ఛాన్స్ లు రావు. కొన్ని సినిమాలు కష్టపడి చేసినా ఎవ్వరూ గుర్తించరు. చివరకు హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతే.. మరికొందరు మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీ అవుతారు.ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరబోతుంది యంగ్ బ్యూటీ […]

Written By: admin, Updated On : September 9, 2021 6:51 pm
Follow us on

Priyanka Jawalkar: హీరోయిన్ అవ్వాలి అంటే..అందం ఒక్కటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి అద్భుతమైన గ్లామర్ ఉన్నా.. కొంతమంది మాత్రం హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించలేకపోతుంటారు. వాళ్లకు హీరోయిన్ ఛాన్స్ లు రావు. కొన్ని సినిమాలు కష్టపడి చేసినా ఎవ్వరూ గుర్తించరు. చివరకు హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతే.. మరికొందరు మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీ అవుతారు.ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరబోతుంది యంగ్ బ్యూటీ ‘ప్రియాంక జవాల్కర్‌’.

చూడటానికి నార్త్ హీరోయిన్ లా ఉన్నా.. ఈ బ్యూటీ అచ్చ తెలుగు హీరోయిన్. ఇక రెగ్యులర్ గా చెప్పుకునట్లే.. మన తెలుగు అమ్మాయి కావడం వల్లే అమ్మడుకి అవకాశాలు రావడం లేదు అనేది అందరికీ తెలిసిన టాపికే. అయితే, ఈ మధ్యలో ప్రియాంక నటించిన కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో మాత్రం ఈ భామ చక్కగా నటించింది. మంచి నటి అనిపించుకుంది.

కాకపోతే హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమెలో లేదు అని, అన్నిటికీ మించి బరువు కూడా బాగా పెరిగిపోయిందని ప్రస్తుతం ఈ బ్యూటీకి హీరోయిన్ ఛాన్స్ లు ఇవ్వడం లేదు. పైగా ఈ మధ్య తరుచూ ప్రియాంక పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఈ హీరోయిన్ ఐటెమ్ సాంగ్స్ చేయడానికి రెడీ అయింది. డాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉందని అందుకే ఐటమ్ సాంగ్ ఒప్పుకున్నానని తన సన్నిహితుల దగ్గర చెబుతోంది ప్రియాంక.

ఈ కరోనా టైమ్ లో సినిమా అవకాశలు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ ముద్దుగుమ్మ.. రవితేజ హీరోగా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రానున్న సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి కసరత్తులు చేస్తోంది. ఐటమ్ సాంగ్ లో నటించక ముందే.. ఆ సాంగ్ అందుకే చేస్తున్నాను, ఇందుకే చేస్తున్నాను అంటూ తనను తాను సమర్థించుకోవడానికి ఈ హీరోయిన్ ఇప్పటి నుంచే నానా పాట్లు పడుతుంది.