Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra Success Story: సెలబ్రిటీలు డబ్బు సంపాదించాలంటే మోసాలే చేయక్కర్లేదు.. ప్రియాంక చోప్రా చూపిన...

Priyanka Chopra Success Story: సెలబ్రిటీలు డబ్బు సంపాదించాలంటే మోసాలే చేయక్కర్లేదు.. ప్రియాంక చోప్రా చూపిన తోవ ఎందరికో ఆదర్శం

Priyanka Chopra Success Story: ఓ శిల్ప శెట్టి డబ్బు సంపాదించడానికి అడ్డమైన మార్గాలు ఎంచుకుంటుంది. ఆమె భర్త మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. కన్నడ నటి రన్య రావు డబ్బు కోసం అక్రమంగా మన దేశానికి దుబాయ్ ప్రాంతం నుంచి బంగారాన్ని తీసుకొస్తూ ఉంటుంది. చివరికి దొరికిపోయి జైలు కూడు తింటుంది.. జాక్వలైన్ ఫెర్నాన్డేజ్ డబ్బు కోసం సుఖేష్ చంద్రశేఖర్ అనే ఆర్థిక నేరగాడితో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే సెలబ్రిటీలు డబ్బు కోసం తొక్కే అడ్డదారులు మామూలుగా ఉండవు.

కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు.. తెలుగులో కూడా ఇలాంటి దారుణాలు చాలానే జరిగాయి. ఇటీవల కాలంలో మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ.. పెళ్లి పేరుతో ఆషూ రెడ్డి.. సబ్స్క్రైబ్ పేరుతో విష్ణు ప్రియ భీమినేని.. వార్తల్లో నిలిచారు. వీరిలో మంగ్లీ భారీ ఎత్తున ఆర్థిక మోసానికి పాల్పడినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈమె పాత్ర గురించి ఇంతవరకు స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. మీడియాలో వస్తున్న కథనాలు మొత్తం ఆమె వైపే వేళ్ళు చూపెడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారాలు ఎంత దూరం వెళ్తాయో తెలియదు కానీ.. సెలబ్రిటీలు ఎలా ఉండాలి.. డబ్బు సంపాదన కోసం ఎలాంటి మార్గాలు అనుసరించాలి.. సమాజం తమకిచ్చిన పేరును ఏ వైపుగా వాడుకోవాలనే దానిపై ప్రియాంక చోప్రా గొప్ప పాఠాలే చెబుతోంది.

ప్రియాంక చోప్రా తన కెరియర్ లో ఏనాడు కూడా ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా అవతరించింది. ఆమె అమెరికా పాప్ సింగర్ ను పెళ్లి చేసుకుంది. సరోగసి విధానంలో ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అమెరికాలో పేరు పొందిన ప్రొడక్షన్ హౌస్లలో నటిస్తోంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయక పాత్ర పోషిస్తోంది. ప్రియాంక చోప్రా కు విపరితమైన డిమాండ్ ఉంటుంది. ఆమె కోరుకుంటే బీభత్సమైన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.. కానీ ప్రియాంక చోప్రా తన డిమాండ్ వరకు మాత్రమే పారితోషకం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రియాంకకు సంబంధించిన ఒక వార్త మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ప్రియాంక చోప్రా కేవలం నటి మాత్రమే కాదు.. స్త్రీల సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. స్త్రీల కేశ సంరక్షణకు సంబంధించి అనామలి అనే ఒక బ్రాండ్ ను ఆమె తీసుకొచ్చింది.. ఈ బ్రాండ్ అనతి కాలంలోనే ఎంతో పేరును సంపాదించుకుంది. అయితే ఈ బ్రాండ్ ను ఇప్పుడు రిలయన్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ ఆధ్వర్యంలోని రిటైల్ విభాగం ఈ బ్రాండ్ దక్కించుకుంది. ఇకపై అనామని ట్రేడ్ మార్క్.. డిజిటల్ ఆస్తులు మొత్తం రిలయన్స్ పరిధిలోకి వెళ్తాయి.. రిలయన్స్ లోని రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ ఉత్పత్తులు అమ్ముతారు.

2021లో అనామాలి బ్రాండ్ ను ప్రియాంక చోప్రా స్థాపించారు. తక్కువ ధరకే నాణ్యమైన కేశ సంరక్షణ ఉత్పత్తిని మహిళలకు అందించారు ప్రియాంక చోప్రా. అనతి కాలంలోనే ఈ బ్రాండ్ విపరీతమైన పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా అనామలి ఉత్పత్తి లభిస్తోంది. ఈ బ్రాండ్ ఎంత కొనుగోలు చేశామనే విషయాన్ని రిలయన్స్ బయట పెట్టలేదు. కాకపోతే రిలయన్స్ కు మన దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. ఈ బ్రాండ్ కొనుగోలు ద్వారా రిలయన్స్ ఇకపై అనామలి ని విక్రయిస్తుంది. అయితే రిలయన్స్ కొనుగోలు చేసినప్పటికీ కూడా ప్రియాంక చోప్రా ఈ బ్రాండ్ కి సంబంధించి క్రియేటివ్ డైరెక్టర్ గా కొనసాగుతుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version