Viral Video: పెంట్ హౌస్లో బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ తో యావర్ రొమాన్స్ .. వైరల్ గా మారిన వీడియో

అయితే తాజాగా ప్రిన్స్ యావర్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. యావర్ - నయని పావని కలిసి చేసిన ఓ రొమాంటిక్ షాట్ వీడియో హల్ చల్ చేస్తుంది.

Written By: Neelambaram, Updated On : December 26, 2023 5:20 pm
Follow us on

Viral Video: ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. తనదైన శైలిలో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన యావర్ సత్తా చాటాడు. టాప్ 4 గా నిలిచి రూ. 15 లక్షల బ్రీఫ్ కేసు తో బయటకు వచ్చాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లక ముందు యావర్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ షో ద్వారా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

అయితే తాజాగా ప్రిన్స్ యావర్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. యావర్ – నయని పావని కలిసి చేసిన ఓ రొమాంటిక్ షాట్ వీడియో హల్ చల్ చేస్తుంది. ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో టేస్టీ తేజ, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నయని పావని హాజరయ్యారు. వాళ్లకు గౌతమ్ కృష్ణ ఆతిథ్యం ఇచ్చాడు. అందరూ కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ఈ నేపథ్యంలో వాళ్ళు కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేశారు. యావర్ – నయని పావని చేసిన క్యూట్ రొమాంటిక్ రీల్ తెగ వైరల్ అవుతుంది. అయితే సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని ఒక్క వారమే హౌస్ లో ఉంది. ఉంది కొద్ది రోజులే అయినా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. మంచి పాజిటివ్ ఇంప్రెషన్ తో బయటకు వెళ్ళింది. హౌస్ లో ఉన్నపుడు నయని, యావర్ పెయిర్ చూసి చాలా మంది మరో లవ్ ట్రాక్ ఉంటుందని అనుకున్నారు.

కానీ నయని పావని ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం యావర్, నయని చేసిన రొమాంటిక్ రీల్ ఆకట్టుకుంటుంది. నెట్టింట ఇది చక్కర్లు కొడుతుంది. ఇక వీడియో చూసిన చాలా మంది క్యూట్ పెయిర్, నయని ఇంకో వారం ఉండుంటే లవ్ ట్రాక్ వేసేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.