Prince Yawar: బిగ్ బాస్ సీజన్ 7తో వెలుగులోకి వచ్చిన నటుడు ప్రిన్స్ యావర్. బెంగాల్ కి చెందిన ఈ కండల కుర్రాడు తెలుగులో పలు సీరియల్స్ లో నటించాడు. అయితే ఎలాంటి ఫేమ్ రాలేదు. దాంతో గట్టి ప్రయత్నం చేసి బిగ్ బాస్ షోకి వెళ్ళాడు. ప్రిన్స్ యావర్ కి తెలుగు రాదు. దాంతో హౌస్లో రాణించడం కష్టమే అనుకున్నారు. అయితే యావర్ మొదట్లో తడబడ్డా మెల్లగా పుంజుకున్నాడు. శివాజీ సపోర్ట్ ఇవ్వడం కలిసొచ్చింది. శివాజీ లీడర్ గా యావర్, పల్లవి ప్రశాంత్ లతో ఒక టీమ్ ఏర్పాటు చేశాడు. స్పై టీమ్ గా వీరు పాప్యులర్ అయ్యారు.
హౌస్లో స్ట్రాంగ్ గా ఉన్న స్పా బ్యాచ్ శోభ, ప్రియాంక, అమర్ లకు గట్టి పోటీ దారులు అయ్యారు. కాగా యావర్ ఒక దశలో రతిక రోజ్ కి దగ్గరయ్యాడు. ఆమె మాయలో పడ్డాడు. గేమ్ కూడా వదిలేశాడు. నాగార్జున హెచ్చరించాక మరలా ట్రాక్ లో పడ్డాడు. యావర్ లో రొమాంటిక్ యాంగిల్ అయితే ఉంది. రతిక రోజ్ నాలుగో వారమే ఎలిమినేట్ కావడంతో లవ్ ట్రాక్ ఫెయిల్ అయ్యింది.
ఆమె రీ ఎంట్రీ ఇవ్వడంతో కొన్ని రోజులు ఆమె చుట్టూ తిరిగాడు. ఏదైతే ఏమీ ఫైనల్ కి వెళ్ళాడు. కప్ తనకు రాదని గ్రహించి తెలివిగా రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. యావర్ నాలుగో స్థానంలో నిలిచాడు. బయటకు వచ్చాక యావర్ ఓ లేడీ కంటెస్టెంట్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె ఎవరో కాదు నయని పావని. ఈ సీరియల్ నటి హౌస్లో పెద్దగా రాణించలేదు. కేవలం ఒక్క వారమే హౌస్ లో ఉంది. ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఆరో వారం ఎలిమినేట్ అయ్యింది.
అందుకు ఆమె చాలా ఫీల్ అయ్యింది. భయంకరంగా ఏడ్చింది. నయని పావని కొన్ని వారాలు హౌస్లో ఉండే ఛాన్స్ దక్కితే కథ వేరేలా ఉండేది. ఆ ఏడు రోజుల్లోనే ఆమె ఆకట్టుకుంది. కాగా నయని పావని, యావర్ కలిసి కొన్ని యూట్యూబ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రొమాంటిక్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. తాజాగా వీరి మధ్య కెమిస్ట్రీ పీక్స్ కి చేరింది. తెలియదే అనే వీడియో సాంగ్ చేసిన ఈ జంట దాన్ని ప్రమోట్ చేసేందుకు రొమాంటిక్ ఫోటో షూట్ చేశారు. అది వైరల్ అవుతుంది.