Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Birthday Special: ఈ ఒక్కడు ఎన్నటికీ ఆగడు: మహేష్ బాబు బర్త్...

Mahesh Babu Birthday Special: ఈ ఒక్కడు ఎన్నటికీ ఆగడు: మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్ భారీ ప్లాన్.. కేక అంతే !

Mahesh Babu Birthday Special: సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. అందుకే, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేష్ బర్త్ డే మేనియానే కనిపిస్తోంది. మహేష్ ‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు ట్విట్టర్‌ ని హోరెత్తిస్తున్నారు. మరోపక్క సినీ ప్రముఖులు కూడా మహేష్ కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి పోటీ పడుతున్నారు. మరి తెలుగు సినిమాల్లో ప్రస్తుత ధ్రువతారగా వెలిగిపోతున్న మహేష్ పుట్టినరోజుకి ఈ మాత్రం హడావుడి లేకపోతే ఎలా ?, అందుకే, మహేష్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu Birthday Special
Mahesh Babu

ఎందుకంటే.. ఇండియా వైడ్ గా మహేష్ బర్త్ డే ట్యాగ్ ను వైరల్ చేయాలని మహేష్ అభిమానులు టార్గెట్ గా పెట్టుకున్నారు. మహేష్ బాబు స్టార్ డమ్ ఏమిటో ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటి చెప్పడానికి ఫ్యాన్స్ గత వారం నుంచే సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ ఫ్యాన్ గ్రూప్స్ తో పాటు అభిమాన సంఘాలను కూడా అలెర్ట్ చేశారు. మహేష్ బర్త్ డే సందర్భంగా నేడు అభిమానులు తమ వ్యక్తిగత పనులకు బ్రేక్ ఇచ్చి.. అందరూ మహేష్ బర్త్ డే ట్యాగ్ ను వైరల్ చేయాలని తీర్మానం చేసుకున్నారు.

Also Read: Telugu Film Industry Best Villain: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ విలన్ పాత్ర ఏమిటి ? బెస్ట్ విలన్ ఎవరు?

మరి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి. ఎన్టీఆర్, బన్నీ బర్త్ డేలు నాడు కూడా ఆయా హీరోల ఫ్యాన్స్ ఇదే విధంగా హడావుడి చేశారు. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. ఇక మహేష్ సినీ ప్రస్థానానికి వస్తే.. తెలుగు పరిశ్రమలోకి రాజకుమారుడుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌ గా ఎదిగాడు మహేష్ బాబు. తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి, మరెన్నో విజయాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబుకి ఈజీగా ఇండస్ట్రీలో ఎంట్రీ దొరికింది. కానీ.. స్టార్ డమ్ మాత్రం మహేష్ తన టాలెంట్ తోనే సాధించాడు.

కెరీర్ మొదట్లో మహేష్ కి అంత ఈజీగా సక్సెస్ లు రాలేదు. ఏ సినిమా చేసినా ఏవరేజ్ దగ్గరే ఆగిపోయేది. కానీ, సినిమా సినిమాకి తన పరిధిని పెంచుకుంటూ తన సినీ కెరీర్ ను క్రమ శిక్షణతో అభివృద్ధి చేసుకున్నాడు. అయినప్పటికీ ఓ దశలో మహేష్ వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డాడు. ఆ తర్వాత తనను తానూ మార్చుకుంటూ చివరకు బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు.

Mahesh Babu Birthday Special
Mahesh Babu

తండ్రి కృష్ణకి తగ్గ తనయుడిగా మహేష్ కి అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిన సమయంలో కూడా.. మహేష్ తనదైన సినిమాలు మాత్రమే చేశాడు. ‘నాని, టక్కరి దొంగ’ అంటూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. మహేష్ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ మహేష్ ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదు. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారంటీ వసూళ్లను అందించిన హీరోగా కూడా మహేష్ కి మంచి గుర్తింపు ఉంది.

మహేష్ కేవలం సినిమాలతోనే కాకుండా.. ఎన్నో సామాజిక సేవలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనకు ఎంత స్టార్ హోదా పెరిగినా.. ఎప్పుడూ ఒదిగే ఉండే మహేష్ కి మా ‘ఓకే తెలుగు’ నుండి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Also Read:Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version